పురుష పునరుత్పత్తి వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే సెమినల్ ఫ్లూయిడ్ అయిన వీర్యం(Sperms), ఫలదీకరణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది,
పురుష పునరుత్పత్తి వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే సెమినల్ ఫ్లూయిడ్ అయిన వీర్యం(Sperms), ఫలదీకరణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, అయితే దీని వల్ల ఇతర చాలా ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. పునరుత్పత్తి కోసం స్పెర్మ్‌ను తీసుకువెళ్లడమే వీర్యం ఏకైక ఉద్దేశం అని చాలా మంది భావిస్తుండగా, వీర్యం గురించి అసలు ప్రయోజనాలు తెలిసినవారు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిపారు. వీర్యం గురించి ఆసక్తికరమైన విషయాలను ఓ అధ్యయనం వెల్లడించింది. స్ఖలనం సమయంలో సుమారు 500 మిలియన్ల స్పెర్మ్ విడుదలవుతుంది. స్పెర్మ్ మరియు వీర్యం ఎక్కువ కాలం జీవించవు. అయితే వాటిలో చాలా వరకు గంటలోనే చనిపోతాయి.
సంతానోత్పత్తి(Fertility): వీర్యం పెరిగిన సంతానోత్పత్తికి ఉపయోగపడడమే కాకుండా ఇందులో ప్రోటీన్లను(Protines) కలిగి ఉంటుంది, ఇది స్త్రీ మెదడుకు హార్మోన్ల సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలు అండాశయాలను ఉత్తేజపరుస్తాయి, ఇది స్త్రీలలో అండాల విడుదలకు దారితీస్తుంది. దీంతో సంతానోత్పత్తిని పెంచే అవకాశాలు మెరుగుపడుతాయి.
చర్మ ప్రయోజనాలు(Skin benefits): చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచడానికి వీర్యం కూడా సహాయపడుతుంది. వైద్యరంగా నిపుణుల ప్రకారం వీర్యంలో స్పెర్మిడిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్. ఈ సమ్మేళనం ఆరోగ్యకరమైన, మరింత యవ్వన చర్మానికి దోహదపడుతుంది.
ఒత్తిడి ఉపశమనం: వీర్యం కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరిచే ఈస్ట్రోజెన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల కారణంగా వీర్యం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనం చెప్తోంది.