దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 5,874 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 49,015గా ఉంది. గత 24 గంటల్లో కేరళలో నమోదైన తొమ్మిది మరణాలతో సహా ఇరవై ఐదు మరణాలు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు(Corona Cases) తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 5,874 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Health Ministry) ఆదివారం తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల(Active Cases) సంఖ్య 49,015గా ఉంది. గత 24 గంటల్లో కేరళ(Kerala)లో నమోదైన తొమ్మిది మరణాలతో సహా ఇరవై ఐదు మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య(Corona Deaths) 5,31,533కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు(Positivity Rate) 3.31 శాతం కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 8,148 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న((Recovery)వారి సంఖ్య 4,43,64,841కి చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.71 శాతం ఉండగా.. కరోనా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. శనివారం దేశంలో 7,171 కొత్త కరోనా కేసులు నమోదుకాగా.. 40 మంది మరణించారు.