ఇటీవలి కాలంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో(Brain) చనిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతున్నది.
ఇటీవలి కాలంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో(Brain) చనిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతున్నది. మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు ఎక్కువవుతున్నాయి. మారిన జీవన శైలి, వాతావరణ కాలుష్యం(Environment pollution), అధిక ఉష్ణోగ్రతలు ఇందుకు కారణం. రిస్క్ ఫ్యాక్టర్స్‌ను పెంచడంలో వాయు కాలుష్యం(Air pollution), అధిక ఉష్ణోగ్రతలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని లాన్సెట్ న్యూరాలజీ జర్నల్ పేర్కొంది. తొమ్మిదో దశకం తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు 72 శాతం పెరిగాయని లాన్సెట్ న్యూరాలజీ జర్నల్ తాజా కథనం తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలే ఇందుకు కారణమంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ మరణాలకు గాలి కాలుష్యానికి సంబంధం ఉందన్న విషయాన్ని కూడా వారు కనిపెట్టారు. 1990లో 73 లక్షల మందికి తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే, 2021నాటికి వీరి సంఖ్య 1.19 కోట్లకు చేరుకుంది. ఈ ముప్పును తప్పించుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. గాలిలో కాలుష్యం లేకుండా చూసుకోవాలి. బహిరంగంగా పొగతాగటాన్ని నిషేధించాలి.