కిడ్నీలోకి ఒక సూక్ష్మ కెమెరా, లేజర్ ప్రోబ్‌లను పంపారు. పెద్ద కోత అవసరం ఉండదు
హైదరాబాద్ లోని ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లోని నిపుణులైన యూరాలజిస్ట్‌ల బృందం కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు ఉన్న రోగి మూత్రపిండాల నుండి 418 రాళ్లను విజయవంతంగా తొలగించారు. మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో 60 సంవత్సరాల వయస్సు మహేష్ కిడ్నీలో ఉన్న రాళ్లను తొలగించారు. ఆయనకు సంప్రదాయ శస్త్రచికిత్స కంటే మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్.టక్, డాక్టర్ దినేష్ నేతృత్వంలోని బృందం నిర్ణయించింది. అందుకోసం పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ (పీసీఎన్‌ఎల్) పద్ధతిని ఎంచుకున్నారు.
కిడ్నీలోకి ఒక సూక్ష్మ కెమెరా, లేజర్ ప్రోబ్‌లను పంపారు. పెద్ద కోత అవసరం ఉండదు ఈ పద్ధతిలో అని వైద్యులు తెలిపారు. అలాగే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది.