ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా, పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా రకరకాల సమస్యలు వెంటాడుతుంటాయి మనుషులను. మనశ్శాంతి లేకుండా.. ప్రాబ్లమ్స్ మనుషులను చుట్టుముట్టుతున్నాయి.. అందులో ముఖ్యంగా అనారోయ్యం . అది కూడా ముఖానికి సబంధించిందయితే.. ఇంకా బాధపడుతుంటారు.
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా, పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా రకరకాల సమస్యలు వెంటాడుతుంటాయి మనుషులను. మనశ్శాంతి లేకుండా.. ప్రాబ్లమ్స్ మనుషులను చుట్టుముట్టుతున్నాయి.. అందులో ముఖ్యంగా అనారోయ్యం . అది కూడా ముఖానికి సబంధించిందయితే.. ఇంకా బాధపడుతుంటారు.
ఇక అలాంటి సమస్యల్లో కళ్ళకింద నల్లని మచ్చలు, వలయాలు కూడా ఒకటి. ఈ కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కంటి కింద నల్లని వలయాలు ఏర్పడుతున్నాయి. అవి గలీజ్ గా కనిపించి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే వాటికోసం మనం నచ్చిన వైద్యంచేస్తుంటాం..
జనరల్ గా ఇలాంటి మచ్చలు కనిపించగానే కనపడగానే మార్కెట్ కి వెళ్లి ఏదో క్రీమ్ తెచ్చేసి రాసేస్తూ ఉంటాం. కాని ఇలా చేయడం చాలా ప్రమాదం. కెమికల్స్ వాడిన క్రీమ్స్ వాడటం వలన ఇంకా చర్మవ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. మనకు ఇంటిలో అందుబాటులో ఉండే కొన్ని వస్తువుల ద్వారా ఈ నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం...
పుదీనా ఆకులు(Mint Leave)ఫ్రెష్ గా ఉంటాయి. అవి మన శరీరానికి కూడా ఫ్రెష్ నెస్ ను ఇస్తాయి. పుదీన చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఈ పుదీనాను పేస్ట్ గా చేసి కంటి చుట్టూ ప్యాక్ వేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు కాని మూడు సార్లు కాని చేస్తే కంటి కింద వలయాలు తొగిపోతాయి... కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
కంటి చుట్టూ చర్మం ప్రకాశవంతంగా మారాలంటే మరో ఉపాయం ఉంది. రోజ్ వాటర్ మనం రకరకాలుగా వాడుతాం.. అలాగే ఈ రోజ్ వాటర్(Rose Watcer) లో కాటన్ బాల్(Cotton Ball) ముంచి కంటి మీద పెట్టుకొని పది నిమిషాలు ఉండాలి... తర్వాత కాటన్ బాల్స్ తీసేసి చల్లని నీటితో కడిగితే కంటి కింది చర్మం మంచి గ్లో తో మెరుస్తుంది.
కంటి కింద నల్లటి వలయాల(Dark Circles)ను తగ్గించటంలో టమోటా చాల సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక టమోటా పేస్టు(Tomoto Paste)లో ఒక స్పూన్ నిమ్మ రసం,చిటికెడు పసుపు,చిటికెడు శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి అరగంట ఆరనివ్వాలి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది కంటికింద వలయాలు కనిపించకుండా పోతాయి.
బంగాళా దుంపల రసం(Potato Juice) తీసి ఆ రసాన్ని కంటి చుట్టూ రాసి ఆరిన తరువాత కడిగేయాలి... ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే కంటి చుట్టూ ఏర్పడిన మచ్చులు, వలయాలు మాయమైపోతాయి...
అంతే కాదు బాదాం ఆయిల్ కాని, బాదాం పేస్ట్ కాని రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ రాసి పడుకోవాలి. ఉదయాన్నే లేచిన తరువాత చల్లని నీటితో కడిగివేస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఉపాయాలు. ఇందులో మీరు సొంతంగా ఇంకేమైనా కలిపితే మాత్రం తేడా కొట్టేస్తుంది జాగ్రత్త. ఆరోగ్యంతో ఆటలపనికిరావు