పిల్లల్లో నూలిపురుగులు(Round worms) సాధారణమే కానీ ఇవి అధికమైతే తీవ్ర కడపునొప్పితో బాధపడతారు.
పిల్లల్లో నూలిపురుగులు(Round worms) సాధారణమే కానీ ఇవి అధికమైతే తీవ్ర కడపునొప్పితో బాధపడతారు. నూలిపురుగులు అంటే పేగు పారాసైట్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు. మురికి ప్రాంతాల్లో నివసించే పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఇవి పేగుల్లో చేరి ఆహారం, రక్తం నుంచి వచ్చే పోషకాలను పీలుస్తుంటాయి. దీంతో చిన్నారులు పోషక ఆహారం లోపంతో బాధపడుతుంటారు. పొట్టలో(stomach) నూలిపురుగులు ఉంటే పిల్లల్లో ఈ లక్షణాలు మనకు కన్పిస్తుంటాయి. కడుపునొప్పి, ఆకలిని కోల్పోవడం, విరేచనాలు, మలద్వారంలో దురద వంటి లక్షణాలతో నూలిపురుగులు ఉన్న పిల్లలు బాధపడుతుంటారు. దీంతో ఈ లక్షణాలు గుర్తించి మన ఇంట్లోనే కొన్ని పదార్థాల వల్ల నూలిపురుగుల సమస్యను నివారించొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.
పచ్చి వెల్లుల్లి(Garlic) తినిపించడం లేదా వెల్లుల్లి టీ తయారు చేయడంతో నూలి పురుగుల సమస్యను అరికట్టవచ్చు. వెల్లుల్లిలో క్రిమినాశక గుణాలున్నాయి. మరొక పదార్థం అల్లంలో కూడా యాంటీ పరాన్న జీవిగుణాలు ఉండడంతో కీటకాలను చంపడంలో సహాయపడుతుంది. ఇది కీటకాలను చంపడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో(Papaya) ఉండే పపైన్ అనే ఎంజైమ్ ఇది కీటకాలను జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. చిననారులకు బొప్పాయి తినిపించవచ్చు. బొప్పాయి తినడం వల్ల మలంతో పాటు పురుగులు బయటకు వస్తాయి. గుమ్మడికాయ గింజల్లో కర్కుర్బిటిన్ అనే రసాయనం ఉండడంతో కీటకాలను పక్షవాతం చేస్తుంది. గుమ్మడికాయ గింజలు కూడా నూలిపురుగుల నివారణకు ఉపయోగపడుతాయి. అయితే సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.