దంతాలపై ఉండే ఈ ఎనామిల్ పొర దెబ్బ తిన‌డం వ‌ల్ల చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తిన్నప్పుడు దంతాలు జివ్వుమ‌నే బాధ‌ క‌లుగుతుంది. ఈ ఎనామిల్ పొర దెబ్బ తిన‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌నం తీసుకునే ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు.

మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వ‌డంలో దంతాలు కీల‌క పాత్ర పోషిస్తాయి. దంతాల స‌హాయంతో ఆహారాన్ని బాగా న‌మ‌ల‌డం వ‌ల్ల మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. కానీ ప్ర‌స్తుతం చాలా మంది దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చ‌ల్ల‌ని – వేడి ప‌దార్థాల‌ను తిన్న‌ప్పుడు దంతాలు జివ్వుమ‌న‌డం ఈ స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నారు. పిల్లల్లో కూడా ఈ స‌మ‌స్య‌ను మ‌నం ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ రావ‌డానికి కార‌ణం మ‌న దంతాల‌పై ఉండే ఎనామిల్ అనే పొర దెబ్బ‌తిన‌డమే. . అయితే దీనికోసం కొన్ని జాగ్ర‌త్త‌లు .... అలాగే మ‌రి కొన్ని చిట్కాలు ఖ‌చ్చితంగా పాటిస్తే వీటికి చెక్ పెట్టవచ్చు. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న దంతాల‌పై 2.5 ఎమ్ఎమ్ మందంతో ఎనామిల్ పొర ఉంటుంది. ఇది చాలా గ‌ట్టిగా ఉంటుంది. ఎనామిల్ 150 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కూడా మ‌ట్టిలో క‌ల‌వ‌దు. 1000 డిగ్రీల వ‌రకు ఉష్ణోగ్ర‌త‌ను కూడా ఎనామిల్ త‌ట్టుకుంటుంది. దంతాలపై ఉండే ఈ ఎనామిల్ పొర దెబ్బ తిన‌డం వ‌ల్ల చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తిన్నప్పుడు దంతాలు జివ్వుమ‌నే బాధ‌ క‌లుగుతుంది. ఈ ఎనామిల్ పొర దెబ్బ తిన‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌నం తీసుకునే ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు. యాసిడ్లు, ర‌సాయనాలు ఎక్కువ‌గా క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎనామిల్ దెబ్బ తింటుంది.

శీత‌ల పానీయాలు యాసిడ్ల‌ను ఎక్కువ‌గా క‌లిగి ఉంటాయి. ఈ యాసిడ్ల‌లో ఉండే గాఢ‌త కార‌ణంగా దంతాలపై ఉండే ఎనామిల్ కరిగిపోతుంది. అతి చ‌ల్ల‌ద‌నం కూడా ఎనామిల్ దెబ్బ‌తిన‌డానికి ఒక కార‌ణం. ఐస్ క్రీమ్స్‌, చాకొలెట్స్‌, బిస్కెట్లు, కేకులు, జామ్ ల‌లో ఉండే పంచ‌దార, ర‌సాయ‌నాలు దంతాల‌పై ఉండే ఎనామిల్ దెబ్బ తినేలా చేస్తాయి. దీని కార‌ణంగా చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తిన్నప్పుడు దంతాలు జివ్వుమంటాయి.

ఫైబ‌ర్ అధికంగా ఉండే చెరుకు ముక్క‌లు, దానిమ్మ గింజ‌లు, బ‌త్తాయి తొనలు, స‌లాడ్స్‌, మొల‌కెత్తిన విత్త‌నాలు తిన‌డం వ‌ల్ల దంతాల‌పై మిగిలి ఉన్న ఎనామిల్ ను కాపాడుకోవ‌చ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నోటిలో ఉండే బ్యాక్టీరియాను న‌శింప‌జేస్తాయి. దంత క్ష‌యం రాకుండా ఉంటుంది. ఈ సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎనామిల్ దెబ్బ తిన‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అయితే దంతాలను ఎడా పెడా బ్రెష్ చేయ‌డం, ఎక్కువ స‌మ‌యం పాటు బ్రెష్ చేయ‌డం మంచిది కాదు .రెండంటే రెండే నిమిషాలు దంతాల‌ను తోముకోవాలి అంటున్నారు డెంటల్ డాక్టర్స్. అదే స‌మ‌యంలో దంతాల‌కు సున్నిత‌మైన బ్రెష్‌నే వాడాలి.మ‌రియు ఏదైనా ఆమ్ల ఆహారాలు తిన్న వెంట‌నే బ్ర‌ష్ చేయ‌రాదు. సెన్సిటివ్ దంతాలు క‌ల‌వారు షుగ‌ర్ ఫుడ్స్‌, కూల్ డ్రింక్స్‌, ఆల్క‌హాల్‌, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అదే స‌మ‌యంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయల‌తో పాటుగా పాలు, పెరుగు, న‌ట్స్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.

అలాగే ల‌వంగాల‌తో సెన్సిటివ్ దంతాల‌ను సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.కొన్ని ల‌వంగాల‌ను మెత్త‌గా పొడి చేసి.అందులో ఆలివ్ ఆయిల్‌ను యాడ్ చేసి పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి.ఈ పేస్ట్‌తో దంతాల‌ను తోముకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే దంతాలు తెల్ల‌గా మార‌డంతో పాటు దృఢంగా మార‌తాయి. సెన్సిటివ్ దంతాల‌ను నివారించడంలో కొబ్బరినూనె అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.సేంద్రీయ కొబ్బరినూనెను నోట్లో వేసుకుని 20 నిమిషాల పాటు బాగా పుక్కిలించి.ఆపై వాట‌ర్‌తో శుభ్రం చేసుకుంటే దంతాల సున్నితత్వం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

మార్కెట్ లో దొరికే టూత్ పేస్ట్ ల‌ను వాడ‌డం వల్ల తాత్కాలికమైన ప్ర‌యోజ‌న‌మే ఉంటుంది. ఈ స‌మ‌స్య‌కు శాశ్వత ప‌రిష్కారం ఉండ‌దు. దంతాలపై నుండి కోల్పోయిన ఎనామిల్ ను తిరిగి పొంద‌లేము. దంతాల‌పై ఉండే ఎనామిల్ ను కాపాడుకోవ‌డానికి యాసిడ్లు, ర‌సాయనాలు క‌లిగి ఉన్న ఆహార ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా తీసుకోవాలి. ఆయుర్వేద టూత్ పేస్ట్‌ల‌ను వాడ‌డం వ‌ల్ల దంతాల‌పై మిగిలి ఉన్న ఎనామిల్ దెబ్బ తిన‌కుండా ఉంటుంది.

Updated On 8 March 2023 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story