మలబద్ధకం(Constipation) అనేది ఎవరికీ చెప్పులోని ఇబ్బందికరమైన సమస్య. దీన్ని ముందుగానే గుర్తించి.. సరైన చర్యలు తీసుకోకపోతే.. మూలశంక, పెద్ద ప్రేగు క్యాన్సర్(Colon Cancer) వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. పైగా గ్యాస్ ట్రబుల్(Gas Trouble), బ్యాక్ పెయిన్(Back pain), విపరీతమైన అలసట, అసహనం లాంటి ఎన్నో చిన్న చిన్న సమస్యలు నిరంతరం వేధిస్తుంటాయి. నిద్ర లేమి, పీసీఓడీ(PCOD), డయాబెటిస్(Diabetes)

మలబద్ధకం(Constipation) అనేది ఎవరికీ చెప్పులోని ఇబ్బందికరమైన సమస్య. దీన్ని ముందుగానే గుర్తించి.. సరైన చర్యలు తీసుకోకపోతే.. మూలశంక, పెద్ద ప్రేగు క్యాన్సర్(Colon Cancer) వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. పైగా గ్యాస్ ట్రబుల్(Gas Trouble), బ్యాక్ పెయిన్(Back pain), విపరీతమైన అలసట, అసహనం లాంటి ఎన్నో చిన్న చిన్న సమస్యలు నిరంతరం వేధిస్తుంటాయి. నిద్ర లేమి, పీసీఓడీ(PCOD), డయాబెటిస్(Diabetes), హైపర్ థైరాయిడ్‌(Hyper Thyroid)తో పాటు షుగర్ వంటి సమస్యలున్న వారిలో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే, కొన్ని రకాల ఆహారపదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ సమస్య పెరిగిపోతుంది. అలవాట్లను మార్చుకోవడం, చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుంది.

లంచ్ టైమ్‌కి
బెల్లా(jaggery)న్ని నేతితో కలిపి తినడం వలన మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే, నేతిలో ముఖ్యమైన ఫ్యాట్స్ లభిస్తాయి. ఈ రెండూ కలిపి జీర్ణక్రియ స్మూత్‌గా జరిగేందుకు సాయం చేస్తాయి. బెల్లం పౌడర్‌ను తీసుకుని అందులో కాసింత నెయ్యిని కలిసి.. మధ్యాహ్నం భోజనం తర్వాత తింటే సరిపోతుంది.

డిన్నర్ టైమ్‌కి
నువ్వుల నూనె(Sesame Oil)ను డిన్నర్ లో తీసుకోవడంతో ప్రయోజనాలుంటాయి. నువ్వుల నూనెలో ఫైబర్‌తో పాటునూనెలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. విటమిన్ E పుష్కలంగా దొరకుతుంది. జీవక్రియను పెంచే ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ నూనెలో ఉంటాయి. మలబద్దకాన్ని తొలగిస్తాయి. ఒక స్పూన్ నువ్వుల నూనెలో నువ్వుల పొడి కలుపుకుని తింటే ఫలితం ఉంటుంది.

అన్నివేళలా..
శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు మలబద్దకం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సమస్యను సహజమైన పద్దతిలో తగ్గించుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్‌(Seasonal Fruits)ను ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం చాలా అవసరం. దాంతో, శరీరంలో వాటర్ కంటెంట్ పెరిగి సమస్య తగ్గుతుంది. ఇక కర్బూజా తినడం వల్ల బ్లోటింగ్ సమస్యను నివారించుకోవచ్చు. దీన్ని సాయంత్రం స్నాక్స్‌గా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో దీన్ని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

పెరుగు తప్పనిసరి
రోజు తీసుకుని భోజనంలో పెరుగు(Curd) భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీరంలో తేమ శాతం తగ్గిపోకుండా కాపాడి, జీర్ణ శక్తిని మెరుగు పరిచేందుకు సహకరిస్తుంది. అందుకే మన పూర్వీకుల నుంచి.. పెరుగు, మజ్జిగలు భోజనంలో భాగంగానే ఉంటాయి. మీకు అలవాటు లేకుండే చేసుకోవడం మంచిది. ఇక నీళ్లు తాగడం, వ్యాయామాలు చేయడం కూడా మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలే.
గమనిక: మీ సమస్య తీవ్రతను బట్టి.. డాక్టర్స్ సలహా మేరకే ఇలాంటివి పాటించాలి.

Updated On 16 April 2023 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story