పసుపు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంది. ఈ గుణాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచి, బ్యాక్టీరియల వలన కలిగే ఇన్ఫెక్షన్ ల నుండి దంతాలను రక్షిస్తుంది. పసుపును, నేరుగా సమస్యలు కలిగిన నోటి ప్రాంతాలలో పూసి, 5 నిమిషాల పాటూ అలాగే ఉంచి
పసుపు(Turmeric), యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంది. ఈ గుణాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచి, బ్యాక్టీరియల వలన కలిగే ఇన్ఫెక్షన్(Infection) ల నుండి దంతాలను రక్షిస్తుంది. పసుపును, నేరుగా సమస్యలు కలిగిన నోటి ప్రాంతాలలో పూసి, 5 నిమిషాల పాటూ అలాగే ఉంచి, వేడి నీటితో కడిగి వేయటం వలన కావిటీలతో పాటు నోటి పూత, ఇతర నోటి సమస్యలు తొలగిపోతాయి.
దంతాల కావిటీ(Tooth Cavity)లు ఈ సమస్య మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏది తిననివ్వదు.. ఇష్టమైనవి తాగే అవకాశం ఇవ్వదు.. అందుకే దంతాల కావిటీలు వచ్చినప్పుడు.. చాలా జాగ్రత్తగా ఉండాలి... అసలు దంతా కావిటీలు రాకుండా జాగ్రత్త పడితే మంచింది. ఇంతకి వీటి నుండి ఎలా రక్షణ పొంద వచ్చో చూద్దాం...
ఉప్పు (Salt)యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలను కూడా కలిగి ఉన్నది ఉప్పు. అందువలన ఉప్పు కావిటీలను శక్తివంతంగా తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు. ఇది ఇన్ఫ్లమేషన్ లను తగ్గించి, నొప్పిని తొలగించి, నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను పూర్తిగా నివారిస్తుంది. దీనికోసం రోజు ఒక గ్లాసు వేడి నీటిలో ఒక చెంచా ఉప్పును కలిపి, పుకిలించండి.. కావిటీల నుండి రక్షణ పొందండి.
దంత సమస్యలను నెంబర్ వన్ మెడిసిన్ అంటే లవంగం పేరు చెప్పుకోవాలి. ఈ ఔషదం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను, అనాల్జెసిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండి, శక్తివంతంగా దంత సనస్యలను తగ్గిస్తాయి. లవంగాన్ని నమలటం వలన వాటి నుండి వచ్చే నూనెలు కావిటీల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా నొప్పిని తగ్గించటమే కాకుండా, ఇతర దంతాలకు కావిటీ సోకకుండా లవంగాలు కాపాడుతాయి.
నువ్వుల నూనె(Sesame oil)మంచి ఆరోగ్యన్ని ఇస్తుంది. అన్ని ఆయుర్వేద మందులలో నువ్వుల నూనెను తప్పకుండా దొరుకుతుంది.. ఈ నువ్వుల నూనెను 2 నుండి 3 చుక్కల లవంగాల నుండి తీసిన నూనెను కలిపి.. కలిపే ముందు చెంచాలో నాలుగవ వంతు నువ్వుల నూనెలో రెండు లేదు మూడు చుక్కలు లవంగం నూనె కలుపండి. కాటన్ బాల్ సహాయంతో, కావిటీ ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని రాయండి. రోజు రాత్రి పడుకోటానికి ముందుగా దంతాలకు రాయటం వలన మంచి ఫలితాలను పొందుతారు ఇలా రకరకాల వంటింటివస్తువులతో ఆరోగ్యాన్ని పొంద వచ్చు...