ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు (High Blood Pressure)తో కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు (High Blood Pressure)తో కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. దీనినే సైలెంట్‌ కిల్లర్‌ (Silent Killer)అని కూడా పిలుస్తారు. రక్తపోటు అధికస్థాయికి చేరుకుంటే గుండెజబ్బులు, స్ట్రోక్(Stroke),బ్రెయిన్‌ స్ట్రోక్(Brain Stroke), కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పటికప్పు బీపీని చెక్‌ చేయించుకొని సరైన మందులు వాడితే ఈ ప్రమాదాల బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. అంతేకాకుండా రక్తపోటును నివారించేందుకు చాలా మార్గాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అసలు అధిక రక్తపోటు లేదా హైబీపీ అంటే ఏంటి.. దానిని ఎలా కొలుస్తారు.? అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రక్తపు పీడనం అనేది రక్తనాళానికి సంబంధించిన గోడలమీద రక్తం ప్రవాహాన్ని తెలుపుతుంది. ఇది మిల్లీమీటర్ల పాదరసం (mmHg) లో కొలుస్తారు. సాధారణంగా రెండు సంఖ్యలుగా వ్యక్తీకరించబడుతుంది. సిస్టోలిక్ పీడనం (అగ్ర సంఖ్య), డయాస్టొలిక్ పీడనం (బాటమ్ నెంబర్). సాధారణ రక్తపోటు 120/80 mmHg ఉంది. రక్తపోటు 140/90 ఎంఎంహెచ్జీ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. బీపీని క్రమం తప్పకుండా చెక్‌ చేసుకోవడం, బీపీని అదుపులో ఉంచుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఎక్సర్‌సైజ్‌ చాలా అవసరం. వారంలో ఐదురోజులు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బీపీ(BP),షుగర్‌(Diabetes)కూడా అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు. అధిక కొలెస్ట్రాల్(Cholesterol),కొవ్వు(Fat), సోడియం(Sodium) అధికంగా ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. అధిక రక్తపోటుకు ఒత్తిడి కూడా ఒక కారణం. స్థాయిలను తగ్గించడానికి ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు లేదా యోగా పద్ధతులను పాటిస్తే రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. మద్యపానం కూడా రక్తపోటు ఎక్కువ కావడానికి కారణమవుతుంది. మద్యపానం, ధూమపానంకి దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రక్తపోటును పర్యవేక్షిస్తూ ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాని వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి దూరం ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ehatv

ehatv

Next Story