ఏ సమయంలో డి-విటమిన్ వస్తుంది!

మన శరీరానికి(body) విటమిన్-డి(Vitamin-D) చాలా ముఖ్యం. విటమిన్-డి సమృద్ధిగా ఉంటే ఎముకలు బలంగా(strong Bones) ఉండడమే కాకుండా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రోజుకు ఒక అరగంటపాటు సూర్యరశ్మి(sun rays) శరీరంపై పడితే విటమిన్‌ డీ అందుతుంది. లేత చర్మం ఉన్నవారు మత్రం 15-20 నిమిషాల వరకు ఎండలో నిల్చోవాలి. అలేగా నల్లని చర్మం ఉన్నవారు అయితే 20-30 నిమిషాలు ఎండలో ఉండాలి. కానీ ఉదయం పూట శరీరానికి సూర్యకాంతి పడితే విటమిన్-డిని ఉత్పత్తి చేసే యూవీబీ కిరణాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఉదయం 8-11 గంటల మధ్య సూర్యకాంతి పడితే యూవీబీ కిరణాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో సూర్యకిరణాలు పడినప్పుడు మన శరీరం నుంచి డీవిటమిన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ యూవీబీ కిరణాలు ఎముకలను బలంగా చేయడమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కాళ్లు లేదా వీపుభాగంపై సూర్యకాంతి పడేలా చేస్తే తగినంత విటమిన్-డి లభ్యమవుతుంది. అయితే మరీ ఎక్కువ సమయం ఎండలో ఉంటే చర్మం దెబ్బతినే అవకాశం కూడా ఉందని అందుకే 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో నిలబడడం సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్‌ డీ సమృద్ధిగా పొందాలంటే చేపలు, గుడ్డు పచ్చసోన, పుట్టగొడుగులు కూడా తినాలని సూచిస్తున్నారు.

Updated On 16 Aug 2024 12:31 PM GMT
Eha Tv

Eha Tv

Next Story