లేడీస్ ఫింగర్(Ladiesfinger) అందే అండి బెండకాయ తింటే ఎన్నో లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
లేడీస్ ఫింగర్(Ladiesfinger) అందే అండి బెండకాయ తింటే ఎన్నో లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బెండకాయలో విటమిన్ ఏ, సీ, కే(Vitamin A,c,K), బీ6 వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉండే పీచు శరీరంలోని ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుందని. అంతేకాక ఇది గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే పీచు జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం సులభంగా కదులుతుంది. మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బెండకాయలోని పీచు రక్తంలో చక్కెర స్థాయిలను(sugar Levels) అదుపులో ఉంచుతుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతాయి. వీటిలో పీచుఎక్కువగా ఉండి కేలరీలు తక్వువగా ఉండడంతో బరువు కూడా తగ్గేందుకు సహాయపడుతుంది. పీచు వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా బయటపడొచ్చు. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని, షుగుర్ ఉన్నవారు వీటిని తినాలని సూచిస్తున్నారు. బెండకాయల వల్ల ఎముకలకు బలం అందుతుందని చెప్తున్నారు. అంతేకాదు బెండకాయతో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి జుట్టు కూడా పెరిగేందుకు దోహదపడుతుందని చెప్తున్నారు ఆరోగ్య రంగ నిపుణులు