చాలా మందికి ఉదయం నిద్రలేచిన(sleep) వెంటనే తుమ్ములు(sneezes) మొదలవుతాయి. అలా ఒకదాని తర్వాత ఒకటి తుమ్ములు రావడంతో మూడ్ మొత్తం పాడవుతుంది. కొన్నిసార్లు తుమ్ములు కాకుండా ముక్కు, గొంతులో దురద కూడా ఉంటుంది. ప్రతిరోజూ ఇది వారికి చాలా పెద్ద సమస్య అని చెప్పుకొవచ్చు. దీంతో వారు రోజంతా ఉత్సాహంగా ఉండలేరు.. అలసిపోయినట్లుగా ఉంటుంది. అలాగే కళ్లు చిన్నగా మారడం..
చాలా మందికి ఉదయం నిద్రలేచిన(sleep) వెంటనే తుమ్ములు(sneezes) మొదలవుతాయి. అలా ఒకదాని తర్వాత ఒకటి తుమ్ములు రావడంతో మూడ్ మొత్తం పాడవుతుంది. కొన్నిసార్లు తుమ్ములు కాకుండా ముక్కు, గొంతులో దురద కూడా ఉంటుంది. ప్రతిరోజూ ఇది వారికి చాలా పెద్ద సమస్య అని చెప్పుకొవచ్చు. దీంతో వారు రోజంతా ఉత్సాహంగా ఉండలేరు.. అలసిపోయినట్లుగా ఉంటుంది. అలాగే కళ్లు చిన్నగా మారడం.. తలనొప్పి సమస్యలు వేధిస్తుంటాయి. కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే ఎందుకు తుమ్ములు వస్తాయో తెలుసుకుందాం.
అలెర్జీ రినిటిస్(Allergic rhinitis) కారణం
ఉదయం నిద్రలేచిన వెంటనే తుమ్ములు వస్తుంటే దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇది ఒక రకమైన అలెర్జీ(allergy). ఈ అలర్జీ ఉన్నవారికి ఉదయం నిద్రలేచిన వెంటనే తుమ్ములు రావడంతోపాటు గొంతులో దురద వస్తుంది. దీనికి కారణం ఉదయం నిద్రలేచిన వెంటనే చుట్టూ ఉన్న దుమ్ము, హానికారక కణాలు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించడమే. ముక్కు ద్వారా అనేక ధూళి కణాలు ఒకే సమయంలో శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీంతో గొంతులో దురదతో పాటు తుమ్ములు రావడం ప్రారంభిస్తాయి. అలెర్జిక్ రినైటిస్ మరింత తీవ్రమైతే, అప్పుడు ముక్కు, గొంతులో దురదతో పాటు ముఖంపై వాపు వస్తుంది.
ఉష్ణోగ్రతలో మార్పు(Weather change) కారణంగా తుమ్ములు కూడా వస్తాయి..
అలర్జీ రినైటిస్‌కు దుమ్ము కీటకాలు మాత్రమే కారణం కాదు. కొన్నిసార్లు ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా.. అలెర్జీ రినిటిస్ కూడా వస్తుంది. దీంతో తుమ్ములు సమస్య మొదలవుతుంది. ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు అతని శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మేల్కొన్న వెంటనే ఉష్ణోగ్రత పెరగుతుంది. ఈ ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా శ్వాస తీసుకోవడంలో మార్పులు వస్తాయి. దీంతో తుమ్ములు మొదలవుతాయి.
ఈ సమస్యను తగ్గించేందుకు చిట్కాలు..
1. అలెర్జీ రినైటిస్ సమస్య ఉన్నవారు తేలికపాటి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఆహారంలో రాతి ఉప్పు(crystal salt) ఉపయోగించండి. అలాగే గోరువెచ్చని నీరు తాగాలి.
2. 10-12 తులసి ఆకులు(Tulsi Leaves), 1/4 టీస్పూన్ నల్ల మిరియాల పొడి, ఒకటిన్నర టీస్పూన్ తురిమిన అల్లం, అర టీస్పూన్ వైన్ రూట్ పొడిని ఒక కప్పు నీటితో తక్కువ మంట మీద వేడి చేయాలి. నీరు మరిగిన తర్వాత దాదాపు సగం మిగిలి ఉన్నప్పుడు దానిని ఫిల్టర్ చేసి తాగాలి. రోజూ ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటితో తాగడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
3. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో రుచికి అనుగుణంగా అర చెంచా పసుపు, రాళ్ల ఉప్పు కలిపి తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే యాంటీ-అలెర్జిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో కూడిన ఎలిమెంట్స్ రినైటిస్ నుండి బయటపడటానికి సహాయపడతాయి.
4. ఒక చెంచా తేనెలో కొద్దిగా ఉసిరి పొడిని కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. అంతే కాకుండా పుదీనా ఆకులతో చేసిన టీ తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.