చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి చెందుతుండడంతో భారత్‌లో కూడా ఈ కేసులు వచ్చే అవకాశం ఉన్నందున
చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి చెందుతుండడంతో భారత్‌లో కూడా ఈ కేసులు వచ్చే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. జనసమూహాలు ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది ఆరోగ్యశాఖ.
తుమ్మినా, దగ్గినా మూతికి మాస్క్ లేదా కర్చీఫ్ ధరించండి
తరుచుగా చేతులు శుభ్రంగా సబ్బు లేదా శానిటైజర్‌తో కడుక్కోవాలి
జనసమూహాలకు దూరంగా ఉండండి
నీరు ఎక్కువగా తాగడం, సరైన పోషకాహారం తీసుకోవడం
ఇంట్లోకి సరైన వెళుతురు పడేలా చూసుకోవాలి
అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలి
సరైన నిద్ర పోవాలి
కరచాలనం చేయవద్దు, టిష్యూ లేదా కర్చీఫ్ వాడిందే మళ్లీ వాడకూడదు
జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారికి దూరంగా ఉండాలి
కళ్లు, ముక్కు, నోటిని చేతులు కడుక్కోకుండా ముట్టుకోరాదు
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు
సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలి