కాలేయం(Liver) శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో పవర్‌హౌస్‌గా పనిచేస్తుంది. కానీ మారుతున్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోని కారణంగా కాలేయం బలహీనంగా మారుతుంది. కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల మీరు ఫ్యాటీ లివర్, హెపటైటిస్, లివర్ ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడే ఛాన్స్ ఉంది. అయితే కాలేయం బలపడాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం. దుంప […]
కాలేయం(Liver) శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో పవర్‌హౌస్‌గా పనిచేస్తుంది. కానీ మారుతున్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోని కారణంగా కాలేయం బలహీనంగా మారుతుంది. కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల మీరు ఫ్యాటీ లివర్, హెపటైటిస్, లివర్ ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడే ఛాన్స్ ఉంది. అయితే కాలేయం బలపడాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
దుంప రసం (BeatrootJuice)
బీట్‌రూట్ రసం కాలేయానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. నైట్రేట్లు, బీటాలిన్, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో ఉంటాయి. ఇది కాలేయం, గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన పానీయంగా పరిగణించబడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి బీట్‌రూట్ జ్యూస్ ఓ వరం.
బెర్రీలు (Berrys)
కాలేయాన్ని బలోపేతం చేయడానికి మీరు మీ రోజువారీ ఆహారంలో బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్ తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా రక్షిస్తుంది. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి గుణాలు ఉన్నాయి.
పసుపు (Turmeric)
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పసుపు కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. అందుకే మీ ఆహారంలో పసుపును క్రమం తప్పకుండా తీసుకోవాలి.
అక్రోట్లు(Walnuts)
వాల్‌నట్స్‌లో అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇది సహజంగా కాలేయాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
బ్రోకలీ(Broccoli)
బ్రోకలీలో ఫైబర్, విటమిన్-ఈ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కాలేయం కోసం.. మీరు తప్పనిసరిగా వారానికి మూడుసార్లు బ్రకోలీని తీసుకోవాలి.
అవకాడో(Avakado)
క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు అవకాడోలో ఉంటాయి. ఇది శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. మీరు అవకాడో తీసుకోవడం ద్వారా కాలేయ సమస్యలను కూడా నివారించవచ్చు.