పుదీనా(Mint Leaves)తో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంటుందంటారు ఆయుర్వేద నిపుణులు. జలుబు, గొంతు నొప్పి లాంటి సమస్యలన్నీ పుదీనాతో చెక్ పెట్టొచ్చన్న సంగతి తెలిసిందే. పైగా పుదీనా అన్ని కాలల్లోనూ దొరుకుతుంది. సామాన్యుడికి అందుబాటు ధరలో... చౌకగా లభిస్తుంది. వేసవి కాలంలో పుదీనాతో ‘కులుక్కి షెర్బత్’ చేసుకుంటే.. వేడి, తాపం వంటివి తగ్గిపోతాయి. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు

పుదీనా(Mint Leaves)తో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంటుందంటారు ఆయుర్వేద నిపుణులు. జలుబు(Cold), గొంతు నొప్పి(Throat Pain) లాంటి సమస్యలన్నీ పుదీనాతో చెక్ పెట్టొచ్చన్న సంగతి తెలిసిందే. పైగా పుదీనా అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. సామాన్యుడికి అందుబాటు ధరలో... చౌకగా లభిస్తుంది. వేసవి కాలం(Summer)లో పుదీనాతో ‘కులుక్కి షెర్బత్’(Kulukki sarbath) చేసుకుంటే.. వేడి, తాపం వంటివి తగ్గిపోతాయి. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమద్ధిగా ఉంటాయి. పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

పుదీనా గ్యాస్, తల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. , వికారం, ఆస్తమా.. దగ్గు వంటివి ఇబ్బందుల్ని దరి చేరనివ్వదు. కొవ్వుని కూడా కరిగించడంలో పుదీనా బాగా ఉపయోగపడుతుంది. అలానే మెమరి లాస్‌ వంటి సమస్యలను కూడా పుదీనా దూరం చేస్తుంది. చర్మ సమస్యలు, దురదలు వంటి వాటి నుండి సులువుగా పుదీనాతో తగ్గించుకోవచ్చు. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని కూడా పుదీనా తగ్గిస్తుంది.

పుదీనాని తీసుకునే పద్దతులు..
కేవలం కూరల్లో, స్పెషల్ రైసుల్లో వేసుకోవడమే కాదు.. పుదీనాని ఇలా కూడా సేవించొచ్చు, ఆరగించొచ్చు. ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని.. సుమారు పది పుదీనా ఆకులు వేసి.. ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని వడకట్టి.. టీ తాగినట్లుగా స్లోగా తీసుకోవాలి. అలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే దీన్ని తీసుకుంటే.. చాలా మంచి ప్రయోజనాలు అందుతాయట. క్రమం తప్పకుండా ఈ పద్దతిని పాటిస్తే.. త్వరగా మీ సమస్యలన్నీ తీరతాయి. వీలు చిక్కినప్పుడు పుదీనా పచ్చడి, పుదీనా రైస్ వంటివి చేసుకుని తినడం కూడా మంచిదే.

పుదీనా కులుక్కి షెర్బత్ చేసుకునే విధానం
పుదీనా ఆకులు కొన్ని, 3 టీ స్పూన్లు సబ్జా గింజలు(పది నిమిషాలు నీటిలో నాబెట్టినవి), 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు పంచదార, 1 టీ స్పూన్ నిమ్మరసం, నిలువునా చీరిన ఒక పచ్చిమిర్చి, ఐస్ ముక్కలు, ఒక నిమ్మకాయ గుండ్రటి ముక్క అన్నీ ఒక గ్లాసులో వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా షేక్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.

Updated On 15 April 2023 1:11 AM GMT
Ehatv

Ehatv

Next Story