ప్రముఖ తెలుగు హీరో, ఎన్టీ రామారావు మనవడు, మోహన్ కృష్ణ తనయుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్ గానే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులిటెల్లో వెల్లడించారు. ఇతనికి భార్య అలేఖ్యా రెడ్డి, కూతురు నిషిక కలరు. తారకరత్న 1983 జనవరి 8న జన్మించాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్ర ప్రదేశ్ లో చేపట్టిన ‘యువగళం’ కుప్పం పాదయాత్రలో శుక్రవారం తారకరత్న పాల్గొన్నాడు. ప్రార్ధన అనంతరం మసీదు నుంచి […]

Health bulliten on Taraka Ratna Health
ప్రముఖ తెలుగు హీరో, ఎన్టీ రామారావు మనవడు, మోహన్ కృష్ణ తనయుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్ గానే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులిటెల్లో వెల్లడించారు. ఇతనికి భార్య అలేఖ్యా రెడ్డి, కూతురు నిషిక కలరు. తారకరత్న 1983 జనవరి 8న జన్మించాడు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్ర ప్రదేశ్ లో చేపట్టిన ‘యువగళం’ కుప్పం పాదయాత్రలో శుక్రవారం తారకరత్న పాల్గొన్నాడు. ప్రార్ధన అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో ఒకసారి గా తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే వాలంటీర్లు, టీడీపీ కార్యకర్తలు ఆయన్ను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు.అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ప్రైవేటు ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. ప్రస్తుతం ఎంతో అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణతో తారకరత్నకు అత్యాధునిక చికిత్సను అందిస్తున్నారు.
అయితే ఈ సాయంత్రం వైద్యాధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటన్లో తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
