మసాల దినుసులో ఒకటిగా ఉంది జాజికాయ.. కాని ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. కాని జాజికాయలో ఉన్న ఔషద గుణాలు గురించి తెలిస్తే.. ఎవరు వదిలిపెట్టారు.

మసాల దినుసులో ఒకటిగా ఉంది జాజికాయ.. కాని ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. కాని జాజికాయలో ఉన్న ఔషద గుణాలు గురించి తెలిస్తే.. ఎవరు వదిలిపెట్టారు. ఇంతకీ జాజికాయలో అంతలా ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా..?

మిరిస్టికా ఫ్రాగ్రన్స్ అనే పేరు గల చెట్టు నుండి జాజికాయ వస్తుంది. ఇది ఒక మసాలా దినుసు. అయితే జాజికాయ ఇండియాకు చెందినది కాదు.. ఇది ఇండోనేషియాకు చెందినది. ఇది సాధారణంగా స్పైసెస్ లో వాడుతుంటారు. అప్పడప్పుడు స్వీట్స్ లో కూడా ఉపయోగిస్తారు. అంతే కాదు రుచికరమైన వంటలలో ముఖ్యంగా సూప్‌లు, మాంసాలు, పానీయాలు అనేక రకాల డెజర్ట్‌లలో జాజికాయను ఉపయోగిస్తారు.

జాజికాయ ఆహారానికి రుచిని పెంచడం మాత్రమే కాదు.. తీనే ప్రతీ ఒక్కరికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ జాజికాయకు ఉన్న అద్భుతమైన లక్షణాల కారణంగా, జాజికాయ శతాబ్దాలుగా అనేక వ్యాధులకు నివారణగా ఉపయోగించబడింది. కాబట్టి, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు జాజికాయ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే జాజికాయను డైరెక్టర్ గా తీసుకోలేం కాబట్టి.. దాన్ని నీటిలో నానబెట్టి.. జాజికాయ నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలుకలుగుతాయి.

జాజికాయ రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్, కాల్షియం మరియు ఇనుముతో సహా వివిధ అవసరమైన పోషకాలకు మంచి మూలంగా పరిగణించబడుతుంది. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి మరియు విటమిన్ బి వంటి చిన్న మొత్తంలో విటమిన్లు కూడా ఉంటాయి.

అవును, నిజానికి ఒక నెలపాటు రాత్రిపూట నిరంతరం జాజికాయ నీటిని తాగడం వల్ల అనేక శారీరక మరియు మానసిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ అలర్జిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, రాత్రిపూట జాజికాయ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా అని చెప్పవచ్చు.

జాజికాయ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది , మీకు ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. జాజికాయలోని గుణాలు శరీరానికి విశ్రాంతినిచ్చి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రాత్రి బాగా నిద్రపోవడానికి మీకు సహాయపడుతుంది.

జాజికాయలో ఉండే గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆ నీటిని రెగ్యులర్ గా తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుంటె పోటువచ్చేప్రమాధాలను కూడా అది తగ్గిస్తుంది.

జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు వెంటాడుతుంటే.. వాటి నుంచి బయటపడటానికి..ఇలాంటి మరిన్న సీజనల్ ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు జాజికాయ నీటిని తాగితే ఉపయోగం ఉంటుంది.

ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు జాజికాయ నీటిని తాగడం వల్ల ఉదయం మీ పొట్ట శుభ్రంగా ఉంటుంది. ప్రధానంగా ఈ నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది అనేక జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. అంతే కాదు మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో జాజికాయ ఎంతో ఉపమోగపడుతుంది.

Updated On 30 Dec 2024 2:00 PM GMT
ehatv

ehatv

Next Story