గోరు వెచ్చటి నీరు తినడానికి ముందు తాగడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణలు సూచిస్తున్నారు. వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీర అవయాలకు రక్తం అందుతుంది. అప్పుడు ఎలాంటి ఒళ్లునొప్పులు అయిన , అనారోగ్య సమస్యలను అయిన తగ్గించుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా గోరువెచ్చని నీళ్లను తరచూ తీసుకుంటుండాలి.
మనం ప్రతిరోజు నీళ్లు ఎక్కువ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని...అందుకే రోజుకు 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే అందులోనూ గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఇంకా అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగాలని పెద్దలు అంటునే ఉంటారు. ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండటానికి వేడి నీళ్లు సహాయపడతాయి. అసలు గోరువెచ్చని నీరు తాగితే.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాము.
అధిక బరువు, ఊబకాయం సమస్యలు ఉన్న వారు తరచూ వేడి నీళ్లు తాగుతుండాలి. శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని మలినాలు, వ్యర్థాలను బయటకు పంపిచేస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు రోజూ గోరువెచ్చని నీళ్లు 2నుంచి 3 గ్లాసుల నీళ్లు తాగాలి. నీరు తక్కువగా తాగేవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. అయితే నీళ్లను ఎక్కువగా తాగేవారిలో శరీరం ఎప్పుడూ హైడ్రేడ్ గా ఉంటుంది. తేమగానూ కాంతివంతంగానూ కనిపిస్తుంది.
నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చటి నీళ్లతో పరిష్కారమవుతాయి. ఆ సమయంలో కలిగే విసుగు అలసట తగ్గుతాయి. పీరియడ్స్ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. కొందరికి చిన్న వయస్సులోనే ముఖంలో ముడతలు కనిపిస్తుంటాయి అయితే గోరువెచ్చని నీరు తాగి దీనికి చెక్ పెట్టవచ్చు. రోజు ఉదయాన్నే రెండు గ్లాసుల వెచ్చటి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి. డయాబెటిస్, గుండె సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి వేడి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.
గోరు వెచ్చటి నీరు తినడానికి ముందు తాగడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణలు సూచిస్తున్నారు. వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీర అవయాలకు రక్తం అందుతుంది. అప్పుడు ఎలాంటి ఒళ్లునొప్పులు అయిన , అనారోగ్య సమస్యలను అయిన తగ్గించుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా గోరువెచ్చని నీళ్లను తరచూ తీసుకుంటుండాలి. నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా శరీరంలోని వేడిని కూడా తగ్గించుకోవచ్చు. గంటల తరబడి కంప్యూటర్ల దగ్గర కూర్చొని పనిచేస్తుండే వారంతా గ్యాప్ ఇస్తూ నీళ్లు తాగుతుండాలి. అది కూడా వేడినీళ్లు అయితే మంచిది. అప్పుడు రక్తప్రసరణ జరిగి పని ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
కడుపు నొప్పి, అజీర్తి, ఉదర సంబంధిత వ్యాధులు, ఊబకాయం, జీర్ణ సమస్య వంటి సమస్యలకు వేడి నీరు తాగడం ద్వారా చెక్ పెట్టవచ్చు . అంతేకాదు రక్త ప్రసరణ బాగామెరుగుపడుతుంది. మూత్ర సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి. గోరు వెచ్చని నీళ్లు తాగితే 3-4 రోజుల్లో చాలా మార్పు కనిపిస్తుంది. నోటిపూత సమస్యలతో బాధపడేవారు కూడా గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. గొంతులో మంటగా అనిపించినా లేదా నోటి అల్సర్ల సమస్యతో బాధపడేవారికి కూడా నొప్పి నుంచి రిలీఫ్ పొందాలంటే వేడినీళ్లను తాగితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. గొంతులో గరగరగా అనిపించినా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా వేడినీళ్లతో సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.