చలికాలం వస్తే చాలు కొంత మందికి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

చలికాలం వస్తే చాలు కొంత మందికి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ కాలంలో శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యంగా అందుకే ఆరోగ్యంపై మరీ ముఖ్యంగా చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. . ఎందుకంటే ఈ కాలంలో శరీరంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. వాటిని కరెక్ట్ గా చూసుకుంటూ.. ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో కొన్ని ఆహారపదార్ధాలు మనకు ఉపయోగపడతాయి. అందులో బెల్లం చాలాముఖ్యమైనది అని చెప్పవచ్చు.

బెల్లంలో ఐరన్ ఉంటుంది. అంతే కాదు పొటాషియం కాల్షియం కూడా ఉంటాయి. అందుకే ఈ చలికాలం బెల్లంతో కొన్ని పదార్థాలను తినడం వల్ల కొన్ని ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చు. వరుసగా మీ ఎముకలు, రక్త ప్రసరణ , కండరాల బలాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. మీ శక్తిని పెంచడానికి బెల్లం మంచి పరిష్కారం.

అంతే కాదు మన రోగనిరోధక వ్యవస్థ పై కూడా బెల్లం ప్రభావం గట్టిగా ఉంటుంది. మనలోని శక్తిని అది మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బెల్లాన్నిచలికాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన తగిన వేడిని పొందడంతో పటు.. బాడీని కంఫర్ట్ గా ఉంచుతుంది.

ఈ చలికాలంలో టీ, కాఫీలో ఎక్కువగా తాగుతుంటారు. అదే టీలో అల్లం, శొంఠి కూడా వాడుతుంటారు. అయితే ఆ తాగే టీ ఏదో బెల్లంతో చేసుకుని.. వాటితో పాటు బెల్లం తింటే చలికాలంలో అనేక శరీర సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా గొంతునొప్పి, కఫం, దగ్గు వెంటనే ఉపశమనం పొందుతాయి. మీరు టీలో అల్లం తో పాటుగా బెల్లం కూడా కలిపి తాగేయవచ్చు.

బెల్లం,నువ్వులు కలిపి చేసిన లడ్డూలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ లడ్డు రోజుకు ఇక్కటి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాంబినేషన్ లో కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ఖనిజాలు శరీరానికి అందుతాయి. ఇవి ఎముకలను దృఢపరచడంలో సహాయపడతాయి.

బెల్లంతో నువ్వులు మాత్రమే కాదు వేరు శనగలు కూడా కలిపి..పల్లీ పట్టీ అంటారు కదా..అది తినడం వల్లు.. పోటీన్ అందుతుంది. పిల్లకు ఇలా పెట్టండి వారు చాలా ఆరోగ్యంగా ధృడంగా తయారవుతారు. వేరు శనగతో ఇలా బెల్లం కలిపి తింటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. శ బెల్లం , వేరుశెనగలను కలిపి తింటే శరీరానికి మరింత శక్తి లభించి కండరాలు దృఢంగా తయారవుతాయి.

Updated On 30 Dec 2024 1:30 PM GMT
ehatv

ehatv

Next Story