వేసవి(Summer)లో ఎంత నీరు తాగాలి, నీరు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నయో తెలుసా..? అస్సలు వదిలిపెట్టరు. జీవకోటికి ప్రాణాదారం నీరు. తిండి లేకపోయినా కొన్ని రోజులు బ్రతకవచ్చు కాని.. నీరు తాగకుండా మాత్రం ఎక్కువ రోజులు బ్రతకలేరు అటువంటి నీరు ఎంత తాగాలి.. నీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ..? అసలు నీరు మన శరీరంలో ఎటువంటి క్రియలను చేస్తుంది. చూద్దాం.

వేసవి(Summer)లో ఎంత నీరు తాగాలి, నీరు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు(Benefits) ఉన్నయో తెలుసా..? అస్సలు వదిలిపెట్టరు.

జీవకోటికి ప్రాణాదారం నీరు. తిండి లేకపోయినా కొన్ని రోజులు బ్రతకవచ్చు కాని.. నీరు తాగకుండా మాత్రం ఎక్కువ రోజులు బ్రతకలేరు అటువంటి నీరు ఎంత తాగాలి.. నీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ..? అసలు నీరు మన శరీరంలో ఎటువంటి క్రియలను చేస్తుంది. చూద్దాం.

వేసవికాలం వచ్చింది. పరగడుపున రాగి పాత్ర(Copper vessels)లో మంచినీరు తాగటం వలన అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి(Health Benefits). ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారణిగాపనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధ్రువీకరించింది. నిద్రలేవగానే ఒకటిన్నర లీటరు మంచినీటిని తాగాలి. తర్వాత గంటవరకు ఎలాంటిఆహారం తీసుకోకూడదని నిపుణులు చెపుతున్నారు.

మంచి ఆరోగ్య ప్రయోజనాల(Health Benefits)కోసం రాగి పాత్రలో నీరు నింపాలి రాత్రంతా నిల్వచేయాలి. కనీసం 4 గంటలైనా నీరు రాగిపాత్రలో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. దాంతో ఇందులో కాపర్తో పాటు ఇతర పదార్థాలను కూడా నీరు గ్రహిస్తుంది. కాపర్ శరీరానికి ఒక పాజిటివ్ ఎనర్జీ(Positive Energy)ని అందిస్తుంది.

ఖాళీ కడుపుతో మంచినీళ్ళు త్రాగడం వలన పెద్దప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. నీరు త్రాగడం ద్వారా జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలను ఎక్కువ మొత్తంలో కిడ్నీలను శుద్ధిచేస్తాయి. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధిని పెంచుతుంది. ఉదయం లేచిన వెంటనే కనీసం అరలీటరు నీటిని త్రాగడం వలన 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం తీసుకొనే ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. రక్తకణాలను శుద్ధిచేయడం వలన శరీరంలోని మలినాలు తొలగుతాయి. ఇలా మలినాలు తొలిగితేనే.. శరీరం ప్రకాశిస్తుంది, ముఖం వికసిస్తుంది. నీరు మన స్వేద గ్రంథులను శుభ్రపరుస్తుంది. దాంతో ఎటువంటి చిరాకు.. వేడి లేకుండా.. రోజువారీ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకోగలుగుతాం.

శరీర ద్రవపదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా నీరు కాపాడుతుంది. అంతే కాదు లోపల అల్సర్కు కారణం అయ్యే బ్యాక్టీరియాను డైజెస్టివ్ ట్రాక్ నుండి తొలగించి అల్సర్ను నివారిస్తుంది.ఇంకా చిత్రమైన విషయం ఏంటీ అంటే.. నీరు గాయాలను త్వరగా నయం చేస్తుంది మరియు చర్మం మీద మచ్చలను తొలగిస్తుంది. థైరాయిడ్ పని తీరును మెరుగుపరుస్తుంది.

నీరు ఎక్కువగా త్రాగడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటుంది. అది మన ఆయుష్షు పెంచుతుంది. అందుకే నీరు బాగా తాగండి.. ముఖ్యంగా ఈ సమ్మర్ లో .. నీళ్ల బాటిల్ పక్కన పెట్టుకుని ప్రయాణం చేయండి. సాధ్యం అయినప్పుడల్లా నీరు తాగండి. రోజుకు 10 గ్లాసులైనా నీరు తాగాలి.. మరిఇంకెందుకు ఆలస్యం మంచినీళ్ళు తాగడం ఇప్పటి నుంచే ప్రారంభించండి మరి.

Updated On 31 March 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story