ఇల్లు మన ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పరిగణిస్తాం. చాలా నీట్‌గా అలంకరించుకుంటాం.

ఇల్లు మన ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పరిగణిస్తాం. చాలా నీట్‌గా అలంకరించుకుంటాం. అనారోగ్యాల బారినపడకుండా దానిని శుభ్రంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అయితే, మీ వంటగది(Kitchen)లో ఒక వస్తువు ఉంది, అది బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తుందని తెలుసా. దాని వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోకమానరు. ఆ వస్తువే వంట గిన్నెలను శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజ్. నివేదికల ప్రకారం, ఒక స్పాంజ్ ఒక క్యూబిక్ మీటరుకు 54 బిలియన్ బాక్టీరియాలను కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఇంటి అంతటా బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తుంది టాయిలెట్ సీటు కంటే మరింత అపరిశుభ్రంగా ఉంటుంది.

వంటగది స్పాంజ్ ఇల్లంతా బ్యాక్టీరియాను వ్యాపింపచేయగలదు. ఇది వంటగదిలో అత్యంత సమస్యాత్మకమైన వస్తువుగా చెప్పాలి. స్పాంజ్‌లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాతో గురైతే వివిధ వ్యాధులబారిన పడతారు. డ్యూక్ విశ్వవిద్యాలయంలోని బయోమెడికల్ ఇంజనీర్ల(Duke Biomedical Engineering) ప్రకారం, స్పాంజ్‌లు పోరస్ నిర్మాణాలను కలిగి ఉంటాయి, ఇక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. స్పాంజ్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోతే, బ్యాక్టీరియా ఇంట్లోని ప్రతి మూలకు వ్యాపిస్తుంది. ఇది న్యుమోనియా(Pneumonia), మెనింజైటిస్(Meningitis),బ్లడ్ పాయిజనింగ్(Blood Poisoning),కిడ్నీ ఫెయిల్యూర్(Kidney Failure) వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుంది.

స్పాంజ్ బాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు

క్యాంపిలోబాక్టర్: ఈ బ్యాక్టీరియాకు గురికావడం వల్ల విరేచనాలు, జ్వరం మరియు కడుపునొప్పి వస్తుంది.

ఎంటెరోబాక్టర్: ఈ బ్యాక్టీరియా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ప్రత్యేకించి సమస్యాత్మకంగా ఉంటుంది ఇది న్యుమోనియాకు కారణమవుతుంది.

ఇ.కొలి: ఈ బ్యాక్టీరియా పొత్తికడుపులో తిమ్మిర్లు, విరేచనాలకు కారణమవుతుంది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

క్లేబ్సియెల్లా: ఈ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు స్పందించదు. న్యుమోనియా, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

మొరాక్సెల్లా: మొరాక్సెల్లా బ్యాక్టీరియా చర్మ వ్యాధులకు, కీళ్లనొప్పులకు దారి తీస్తుంది.

సాల్మొనెల్లా: ఈ బ్యాక్టీరియా ఆహారం, నీటికి సోకుతుంది, ఇది జ్వరం, అతిసారం, పొత్తికడుపు తిమ్మిరికి దారితీస్తుంది.

అయితే ఈ బ్యాక్టిరియా బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోలని సూచిస్తున్నారు. స్పాంజ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి. స్పాంజ్‌ను మైక్రోవేవ్‌లో రెండు నిమిషాలు ఉంచడం వల్ల చాలా బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. గిన్నెలు కడుగుతున్నప్పుడు గ్లౌజ్‌లు వేసుకుంటే మంచిది. స్పాంజ్‌లకు బదులుగా స్క్రబ్బర్లు, సిలికాన్ బ్రష్‌లు లేదా మెటల్ స్క్రబ్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

ehatv

ehatv

Next Story