గుమ్మడికాయ అనగానే మనకు మొదటగా గుర్తు వచ్చేది దిష్టి కి వాడేదిగా గుర్తు వస్తుంది . కానీ భారతీయ సాంప్రదాయ వంటకాలలో గుమ్మడికాయకు మంచి స్థానం ఉంది. అయితే గుమ్మడికాయను గృహప్రవేశాలలో, కొత్త వాహనాలకు దిష్టి తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గుమ్మడికాయ వంటలకు, దిష్టి తీయడానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దా౦ . గుమ్మడికాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు .... గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ […]
గుమ్మడికాయ అనగానే మనకు మొదటగా గుర్తు వచ్చేది దిష్టి కి వాడేదిగా గుర్తు వస్తుంది . కానీ భారతీయ సాంప్రదాయ వంటకాలలో గుమ్మడికాయకు మంచి స్థానం ఉంది. అయితే గుమ్మడికాయను గృహప్రవేశాలలో, కొత్త వాహనాలకు దిష్టి తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గుమ్మడికాయ వంటలకు, దిష్టి తీయడానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దా౦ .
గుమ్మడికాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ....
గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు . త్వరగా ఎక్కువగా ఆకలి కానివ్వదు. గుమ్మడికాయ కంటి దృష్టిని మెరుగుపరచడం తో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది . గుమ్మడికాయలో విటమిన్ బి1, బి2, బి6, సి, డి, పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఐరన్, క్యాల్షియం, కాపర్, పొటాషియం, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుని త్రాగితే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు బోలెడు ఉంటాయి . గుమ్మడికాయ జ్యూస్ లో శరీరాన్ని చల్లబరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కనుక గుమ్మడికాయ జ్యూస్ ను తీసుకుంటే శరీర వేడి తగ్గిపోయి చల్లదనం అందుతుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది: గుమ్మడికాయలో విటమిన్ సి, మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరానికి హాని చేసే వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి: నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి జ్యూస్ లో తేనె కలుపుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
గుమ్మడికాయలో , ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు సమస్యలను నివారించి గుండె ఆరోగ్యాన్ని ) మెరుగుపరుస్తాయి. అందుకే ప్రతి రోజు గుమ్మడి జ్యూస్ ను తీసుకోవడం మంచిది. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది: గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. గుమ్మడి జ్యూస్ ను తీసుకుంటే ఇందులో ఉండే ఐరన్ హార్మోన్ల అసమతుల్యత సమస్యలను తగ్గిస్తుంది. దీంతో సంతాన ప్రాప్తిని పొందవచ్చును . సంతానం కావాలనుకునే స్త్రీలు గుమ్మడి జ్యూస్ ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ జ్యూస్ తీసుకుంటే ఫైల్స్ కిడ్నీలో స్టోన్స్, కంటి, చర్మ, జుట్టు, వంటి సమస్యలు తగ్గుతాయి. కనుక ప్రతిరోజూ డైట్లో గుమ్మడి జ్యూస్ ను చేర్చుకుంటే మరిన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.