అల్లం టీ .. అల్ల వెల్లుల్లి(ginger garlic paste) పేస్ట్.. అల్లం రసం, చెరకురసంలో అల్ల.. ఇలా రకరకాలుగా అల్లాన్ని తీసుకుంటుంటారు. అసలు అల్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా.. తెలిస్తే.. ఇంకా జాగ్రత్తగా వాడి.. ఆరోగ్యాన్నిమెరుగుపరుచుకోవచ్చు.

అల్లంతో(ginger) అద్భుతమైన ఔషదాలు,

అల్లం టీ .. అల్ల వెల్లుల్లి(ginger garlic paste) పేస్ట్.. అల్లం రసం, చెరకురసంలో అల్ల.. ఇలా రకరకాలుగా అల్లాన్ని తీసుకుంటుంటారు. అసలు అల్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా.. తెలిస్తే.. ఇంకా జాగ్రత్తగా వాడి.. ఆరోగ్యాన్నిమెరుగుపరుచుకోవచ్చు.

సాధారణంగా గొంతు మంట, గొంతు నొప్పి.. లాంటి సమస్యలు ఉంటే.. పచ్చి అల్లం ముక్క కొంచెం నమిలితే,
బొంగురుపోవడం, గొంతు నొప్పి వెంటనే తగ్గుతాయి.ఉల్లిపాయ రసంలో కొంచెం అల్లం రసం కలిపి తీసుకుంటే వికారం, వాంతులు
తగ్గుతాయి.

అల్లం రసం కొద్దిగా వేడి చేసి.. చెవిపోటు ఉన్నప్పుడు నాలుగుచుక్కలు వేసుకోవచ్చు వెంటనే ఉపశమనం కనిపిస్తుంది. ఇక ఈఅల్లం రసాన్ని కీళ్ళ నొప్పులకు పైపూతగా కూడా ఉపయోగించవచ్చు.

ఇక ఎండిన అల్లం లేదా శొంఠి, జీలకర్ర, ఉప్పు సమాన భాగాలుగా కలిపి పొడి కొట్టుకోవాలి. ఈపొడిని ఒక అరస్పూను తీసుకుని నీటితో రెండుపూటలా తాగాలి ఇలా చేస్తే అజీర్ణం తగ్గిపోయి.. ఎటువంటి ఆహారం అయినా వెంటనే జీర్ణం అవుతుంది. రకరకాల జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

అల్లం సన్నగా తురిమి, దానిలో నిమ్మరసం, ఉప్పు కలుపుకొని గోరువెచ్చని నీటితో తాగినట్లయితే గుండెదడ తగ్గుతుంది. అంతే కాదు ఎసిడిటీ తగ్గాలంటే రెండు చెంచాల శొంఠి, రెండు చెంచాల ధనియాలు కలిపి పొడిచేసి ఆ చూర్ణాన్ని తేనెలో రంగరించి రోజూ తీసుకుంటే.. ఎటువంటి ఎసిడిటీ అయినా మటుమాయం అవుతుంది.

అంతే కాదు పైత్యానికి విరుగుడుగా కూడా అల్లం బాగా పనిచేస్తుంది. పైత్యాన్ని అల్లం తగ్గిస్తుంది. అల్లం ఏ రూపంలో తీసుకున్నా పైత్యం తగ్గిపోతుంది. ఇక అల్లం రసం షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది.

అల్లం దగ్గు, జలుబు, నోటిపూతలను సమర్ధవంతంగా నివారిస్తుంది. జలుబు, దగ్గు, ఆస్మా, ఫ్లూ జ్వరం - అన్నిటికీ అల్లంతో చేసిన టీ తాగితే చక్కని ఉపశమనం.అల్లం గొప్ప విరేచనకారి - మలబద్ధకం నివారిస్తుంది. అల్లం కొలెస్టరాల్ను తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అంతే కాదు అల్లం రసం క్రమం తప్పక ప్రతిరోజూ తీసుకోవడం వలన ఉబ్బస వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది.

అల్లం పైపొట్టు తీసి బాగా అతి చిన్న ముక్కలుగా తరిగి, దీన్ని నీడలో ఆరనిచ్చి,జీలకర్ర, దాల్చినచెక్క, సైంధవ లవణం పొడిగా కలిపి, రోట్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అన్నీ కలిపి ఓ సీసాలోగాని, జాడీలోగాని వేసి, ఆ మిశ్రమం మునిగేంతవరకు నిమ్మరసం కలిపి ఎండలో ఉంచాలి.నిమ్మరసం ఎండిపోయి, ఈ మిశ్రమం పొడి పొడిగా అయ్యేంతవరకు ఎండబెట్టాలి. దీన్ని మెత్తగా దంచి ఒక శుభ్రమైన సీసాలో నిలవ చేసుకోవాలి.కడుపునొప్పి వచ్చినపుడు ఒక అరచెంచా పొడిని నోట్లో వేసుకుని వెచ్చని
నీరు తాగితే వెంటనే కడుపునొప్పి తగ్గి, ఆకలి వేస్తుంది. ఇలా అల్లం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మరి అల్లాన్ని ఇంట్లో ఉండేలా చేసుకోండి మరి.

Updated On 17 April 2023 12:12 AM GMT
Ehatv

Ehatv

Next Story