కొందరి శరీరతత్వాన్ని బట్టి.. కాలంతో సంబంధం లేకుండా ఊరికే చెమటలు(Sweat) పోస్తుంటాయి. ఆందోళన వల్లనో, అలసట వల్లనో, వాతావరణంలో(weather) వచ్చే మార్పుల వల్లనో, శరీరంలో జరిగే అసాధారణ మార్పుల వల్లనో..
కొందరి శరీరతత్వాన్ని బట్టి.. కాలంతో సంబంధం లేకుండా ఊరికే చెమటలు(Sweat) పోస్తుంటాయి. ఆందోళన వల్లనో, అలసట వల్లనో, వాతావరణంలో(weather) వచ్చే మార్పుల వల్లనో, శరీరంలో జరిగే అసాధారణ మార్పుల వల్లనో.. మనకు చెమటలు పోయడం సర్వసాధారణం. అలాగే హార్మోన్ల మార్పులు, ఒత్తిడి(Pressure), భయం(Fear) వల్ల కూడా చెమట గ్రంథులు ప్రేరేపితమవుతాయి. నాడీ వ్యవస్థ.. ఎక్రిన్ గ్రంథులను ప్రేరేపించడం ద్వారా చెమటలొస్తాయి. అయితే చాలామందికి హైపర్ హైడ్రోసిస్(Hyperhidrosis) అని పిలువబడే ఒకరకమైన చెమట.. ఇబ్బందికరమైన సమస్యగా మారుతుంది. వయస్సు, జన్యుపరమైన సమస్యలు, శరీర పటుత్వం.. ఇలా అనేకరకాల అంశాలపై ఆధారపడి చెమటలు పడుతుంటాయి. వాటిని ఆపేందుకు కొన్ని ఇంటి చిట్కాలు మీకోసం.
నిమ్మరసం
సిట్రిక్ యాసిడ్(citric acid) ఎక్కువగా నిమ్మకాయలో(Lemon) దొరుకుతుంది. సిట్రస్ యాసిడ్ అధిక చెమటను తగ్గించడంలో సాయపడుతుంది. బ్యాక్టీరియాని(bacteria) ఇట్టే తొలగిస్తుంది. సగం నిమ్మకాయను తీసుకుని చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతంలో రుద్దాలి. ఇలా చేయడం వల్ల చెమటతో పాటు దాని వల్ల కలిగే దుర్వాసన కూడా తగ్గుముఖం పడుతుంది.
బంగాళదుంప(potato) రసం
బంగాళాదుంప ముక్కను చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతంలో రుద్ది, చల్లటి నీళ్లతో కడిగితే మంచిఫలితం ఉంటుంది. ఈ దుంపల్లో సహజసిద్దమైన ఆల్కలీన్(క్షరాల) స్వభావాన్ని కలిగి ఉంటుంది. అది బాడీలోని pఏ స్థాయిని సమతుల్యం చేయడానికి అత్యుత్తమంగా పనిచేస్తుంది. చెమట ఎక్కువగా వచ్చే చోట క్రమం తప్పకుండా బంగాళదుంప రసాన్ని అప్లై చేసుకోవడం వల్ల చెమటలే కాదు.. ఆయాప్రాంతాల్లోని నల్లటి మచ్చలు కూడా తగ్గుతాయి.
బ్లాక్ టీ(Black tea)
బ్లాక్ టీలో సాధారణ టీ కన్నా ఎక్కువగా టానిక్ ఆమ్లం ఉంటుంది. అది చెమట గ్రంథులను పరిమితం చేస్తుంది. దీనిలోని యాంటీపెర్స్పరెంట్.. చెమటలకు మంచి ఉపశమనం అని చెప్పొచ్చు.
బేకింగ్ సోడా..(Baking soda)
చెమటలోని కొన్ని ఆమ్లాలు అధిక దుర్వాసనకు కారణం అవుతుంటాయి. వాటికి చెక్ పెట్టాలంటే.. సహజసిద్దమైన ఆల్కలీన్ స్వభావాన్ని కలిగిన బేకిండ్ సోడాని వాడితే మంచిది. ఇది చెమటను తగ్గించడమే కాకుండా శరీర దుర్వాసన దూరం,చేస్తుంది. దీన్ని పౌడర్ పఫ్‌తో దీన్ని చెమట పట్టే ప్రాంతంలో లైట్‌గా అప్లై చేసుకుంటే.. సరిపోతుంది. ఎక్కువగా అప్లై చేయకూడదు. ఎక్కువ సేపు ఉంచకూడదు.
తినే తిండే ముఖ్యమే
అధిక చెమటలకు ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యమే. కొన్ని రకాల ఆహారపదార్థాల కారణంగా కూడా ఎక్కువగా చెమట పోస్తాయి. తక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలు జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అధిక సోడియం ఉండే ఆహార పదార్ధాలు.. శరీరం నుంచి అదనపు మూత్రం, చెమట రూపంలో బయటికి వచ్చేస్తాయి. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు, మీ శరీరం కొవ్వును ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీ శరీరంలోపల ఉష్ణోగ్రతలను పెంచుతాయి. దాంతో అటువంటి ఆహారాలను తగ్గించి తీసుకుంటే మంచిది.