సుబ్బరంగా వంట చేసుకుని ఆరోగ్యకరమైన భోజనం చేయకుండా అస్తమానం రెస్టారెంట్‌లకు(Restaurants) వెళ్లడం చాలా మందికి అలవాటయ్యింది. అడిగితేనేమో అబ్బే వంట చేసుకునే టైమ్‌ లేదండి అని జవాబిస్తుంటారు. వీకెండ్‌లో అయితే మరీనూ.. హోటల్స్‌ ముందు క్యూలు కనిపిస్తుంటాయి. ఇంటి ఫుడ్‌ను తినడం మానేసి బయటఫుడ్డుకు అలవాటుపడిన వారు గుండె దిటవు చేసుకోవాలి.

సుబ్బరంగా వంట చేసుకుని ఆరోగ్యకరమైన భోజనం చేయకుండా అస్తమానం రెస్టారెంట్‌లకు(Restaurants) వెళ్లడం చాలా మందికి అలవాటయ్యింది. అడిగితేనేమో అబ్బే వంట చేసుకునే టైమ్‌ లేదండి అని జవాబిస్తుంటారు. వీకెండ్‌లో అయితే మరీనూ.. హోటల్స్‌ ముందు క్యూలు కనిపిస్తుంటాయి. ఇంటి ఫుడ్‌ను తినడం మానేసి బయటఫుడ్డుకు అలవాటుపడిన వారు గుండె దిటవు చేసుకోవాలి. వారికో షాకింగ్‌ న్యూస్‌. చిన్న చిన్న రెస్టారెంట్లే కాదు, పెద్ద పెద్ద హోటల్స్‌లో వాడుతున్న ఆహారపదార్థాల గురించి తెలిస్తే జన్మలో బయటఫుడ్డు తినరు!చాలా హోటల్స్‌లో నాణ్యత(Quality) లేని వస్తువులను, పాడైన ఆహారపదార్థాలను వాడుతున్నట్టు ఫుడ్‌ సేఫ్టీ అధికారుల(Food Saftey Officer) తనిఖీలో తేలింది. హైదరాబాద్‌ నగరంలోని 24 పెద్ద రెస్టారెంట్లలో చెత్త ఫుడ్‌ పెడుతున్నారని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ప్యూర్‌ వెజిటేరియన్లకు(Vegetarians) అయితే ఇది షాకిచ్చే న్యూసే! ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఓ రెస్టారెంట్ పై జరిపిన దాడుల్లో కిచెన్ చూసి బిత్తరపోయారు. కిచెన్ లో ఓ ప్లాస్టిక్ బుట్ట నిండా చేప ముక్కలు, వాటిపై పన్నీరు ముక్కలు ఉన్నాయట! ప్యూర్ వెజ్ ఆర్డర్ చేసిన వారికి ఈ పన్నీరు ముక్కలే వడ్డిస్తున్నారు. ఇలా చెత్త ఫుడ్‌ పెడుతున్న రెస్టారెంట్లపై త్వరలో చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.

Updated On 23 May 2024 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story