ఒకప్పటిలా కాదు మనిషి జీవితం.. అంతా ఒత్తిడి మధ్యే సాగుతోంది. ఏది ఉన్నా లేకున్నా మనిషి జీవితంలో టెన్షన్, ఒత్తిడి, చిరాకు, కోపం లాంటివి మాత్రం కామన్ గా ఉంటున్నాయి. వాటిని దూరం చేసుకోని..కోంచెంలో కొంచె అయినా ప్రశాంతంగా ఉండాలి అంటే..? కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి.. మరణాన్నికి కాస్తాయినా దూరంగా ఉంటారు. లేదంటే..ఎప్పుడు టపీమంటారో చెప్పడంకష్టంమే.
ఒకప్పటిలా కాదు మనిషి జీవితం.. అంతా ఒత్తిడి మధ్యే సాగుతోంది. ఏది ఉన్నా లేకున్నా మనిషి జీవితంలో టెన్షన్, ఒత్తిడి, చిరాకు, కోపం లాంటివి మాత్రం కామన్ గా ఉంటున్నాయి. వాటిని దూరం చేసుకోని..కోంచెంలో కొంచె అయినా ప్రశాంతంగా ఉండాలి అంటే..? కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి.. మరణాన్నికి కాస్తాయినా దూరంగా ఉంటారు. లేదంటే..ఎప్పుడు టపీమంటారో చెప్పడంకష్టంమే.
అసలేఇది హార్ట్ ఎటాక్ (Heart Attack) ల కాలం. చిన్ప పెద్ద తేడా లేకుండా.. వయస్సుతో సబంధం లేకుండా.. ఒత్తిడి తట్టుకోలేక హార్ట్ఎటాక్ లు వస్తున్నాయి. రకరక టెంక్షన్ తో ఇప్పుడు అందరు ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్ ఒత్తిడి, ఇంటి సమస్యలు, లవ్ ప్రాబ్లమ్స్, గొడవలు, అనారోగ్యం, ఇలా ప్రతీది ఇప్పుడు సమస్యగా మారింది. వీటి గురించి ఆలోచిస్తే మనిషి ఇంకా ఎక్కువగా క్షీనిస్తాడు.
అందుకే వాటినుండి రిలీవ్ పొందే కొన్ని మార్గాలు ఇప్పుడు చూద్దాం..ఈ ఫాస్ట్ జనరేషన్ లో మెడిటేషన్ ను మనిషి మర్చిపోతున్నాడు. దీని వలన ఉపయోగం ఉంటుందా అని ప్రశ్నించే బదులు మెడిటేషన్ ను రోజూ ప్రాక్టీస్ చేసి చూడండి. అది మానసినకంగా ఎంతో ఉపశమనం ఇస్తుంది. అలాగే రోజు లేవగానే కొంచె సేపు వ్యాయామం చేయండి ఇలా చేయడం వలన శరీరం కొంచెం తేలిక అవుతుంది. ఫిజికల్ ఫిట్ నెస్ కూడా మనిషి మానసికంగా దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మనిషి ఎంతో ఉల్లాసంగా మారుతాడు.
ఫాట్ ఫుడ్స్(Fast Foods), జంక్ ఫుడ్స్(junk Foods), తినడం మానేయండి. ఇవి ఉన్న టెంక్షన్ ను ఇంకా రెట్టింపు చేస్తాయి... మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే ఫ్రెష్ కూరగాయలను (Fresh Vegitables) తిని చూడండి..జంక్ ఫుడ్ వల్ల బద్దకం, డల్ నెస్ బాగా పెరుగుతాయి. మునుపటిలా హుషారుగా ఉండలేరు కూడా. మీకు ఇస్టమైన ఆటలు ఆడటానికి కొంచెం టైం కేటాయించుకోండి... మీ పిల్లలతోనో... లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళతోనో సరదాగా చిన్న చిన్న ఆటలు ఆడండి... ఇవి మీకు ఒత్తిడి నుండి ఉపశమనం ఇస్తుంది. ఇంకా చిన్న పిల్లలు మన ముందు ఉండి ఆడుకుంటుంటే..మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు.
మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మంచి కామెడీ నవలలు చదవండి. లేదా ఉల్లాసాన్ని కలిగించే బుక్స్ ఏవైనా చదవండి. అవి మీకు ఎంతగానో ఉపయోగపడుతాయి. అంతే కాని చవులు, బ్రతుకులు, యుద్దాలు, నరకాల.. హారర్ బుక్స్ మాత్రం చదవకండి.. వాటి వల్ల ఒత్తిడి రెట్టింపు అవుతుంది. మంచి పాటలు కూడా మనకు టెంక్షన్స్ నుండి రిలీఫ్ ఇస్తాయి.. మంచి మ్యూజిక్ వినడం కూడా మానసికంగా ఒత్తిడి నుండి దూరం చేస్తుంది. మీకు ఇష్టమైన మ్యూజిక్ ను వినండి.. లేదా వింటూ పనిచేసుకోండి. టెంక్షన్ ఫ్రీ అయిపోతారు.
కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. కుటుంభంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేట్టు చూసుకోండి. ఎన్నో టెంక్షన్స్ తో ఇంటికి వచ్చిన వారికి ఇల్లు ప్రశాంతంగా కనిపిస్తే.. ఎటువంటి టెంక్షన్స్ అయినా పారిపోతాయి... మనసుకి ప్రశాంతత వస్తుంది. ఇంట్లో ఉన్న మన వారితో కలిసి బోజనం చేయండం.. వారితో సరదాగా కబుర్లు చెప్పడం కూడా మంచి ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇలాంటివి చాలా పాటిస్తూ.. కుటుంబంతో హ్యాపీ లైఫ్ ను గడపండి. అనౌసరమైన ఆలోచన మన బుర్రలోలేకుంటే.. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.