ప్రస్తుతం మనం జంక్ ఫుడ్స్(junk foods) అంటూ వాటి వెంట పడి మరీ తింటున్నాం. అవన్నీ పైత్యకారులని మర్చిపోతున్నాం. మన శరీరాన్ని శుద్ది చేసే పీచుపదార్ధాలను(Fibers) తినడానికి మనకు కుదరడంలేదు. కాని పీచు తినడం వల్ల కలిగే ప్రయోజనాలుతెలిస్తే అసలు వదిలిపెట్టరుమరి.

ప్రస్తుతం మనం జంక్ ఫుడ్స్(junk foods) అంటూ వాటి వెంట పడి మరీ తింటున్నాం. అవన్నీ పైత్యకారులని మర్చిపోతున్నాం. మన శరీరాన్ని శుద్ది చేసే పీచుపదార్ధాలను(Fibers) తినడానికి మనకు కుదరడంలేదు. కాని పీచు తినడం వల్ల కలిగే ప్రయోజనాలుతెలిస్తే అసలు వదిలిపెట్టరుమరి.

పీచు చేసే మేలు ఇప్పటి సూపర్ స్పీడ్ తరానికి తెలీదు. మన తాతలు, తండ్రులను అడిగితే తెలుస్తుంది. పీచు యొక్క ఉపయోగాలు. ఇప్పటికీ మన కుర్రాళ్లలో(Men) తెలియని బాధలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయాననే మోషన్(Motion) అవ్వక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అదే వారానికి నాలుగైదు రోజులు పీచు ఎక్కువగా ఉన్న పదార్ధాలు తినండి.. తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతో పాటు. పేగులు(small intestine) క్లీన్ అవుతాయి. దాని వల్ల చర్మానికి(skin) కాంతి కూడా వస్తుంది.

నూడిల్స్(Noodles), పిజ్జాలు(pizza), బర్గర్లు(burger), కెంటకీ చికెన్లు(Chiken)... వీటిలో పీచుపదార్థం ఏదీ వుండదు, నోటికి టేస్ట్... ప్రేవులకు రెస్ట్ దొరుకుతుంది. లోపల అంటుకుపోయి ఉంటాయి కాబట్టి.. పేగులు క్లీన్ అవ్వక.. ఉదయాననే మలబద్ధకం(constipation). బాధిస్తుంది. అదే పీచు(fibers) ఎక్కువ తింటే.. పేగులు క్లీన్ అవుతాయి.. శరీరం శుద్ది అవుతుంది.

జీర్ణశక్తిలో(digestive system) ఎలాంటి లోపాలు కలుగవు. అందువలన ఫైబర్కలిగిన ఆహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
ఆకుకూరలు, పచ్చి కూరగాయలతో పాటు.. బీన్స్, గోరుచిక్కుడు, చిక్కుడు, లాంటివి ఎక్కువగా తీసుకోండి. ఏ కూరగాయకూ తొక్కను సాధారణంగా తీయకండి. దానివల్ల మన శరీరానికి సహజంగా కావలసిన పీచు లభిస్తుంది.

ముడిబియ్యం ఎక్కువ వాడండి. మైదా పిండికంటే చపాతి పిండి, మొక్కజొన్న పిండి, జొన్న పిండిని బాగా వాడండి. రాగి అన్నం, జొన్న అన్నం, ఇలావెరైటీ ట్రై చేయండి. ముదురు కూరగాయలు తినడం అలవాటు చేసుకోండి. బీన్స్, పొట్టు ధాన్యాలు, ఓట్స్ధాన్యంతో తయారైన బ్రెడ్స్లో పీచు అధికమోతాదులోనే ఉంటుంది.

రోజు పీచు 25 గ్రాములు తప్పనిసరిగా తినాలి. అప్పుడే మనకు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఫైబర్ పదార్థాలు కొలెస్టరాల్ను తగ్గించడానికి, శక్తిని నిలకడగా విడుదలయ్యేల సహాయపడుతుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ పీచు పదార్థం మనం తీసుకోకపోతే అనారోగ్యం పలుకరిస్తుంది. జాగ్రత్తగా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి. పీచు మనకు మేలు చేస్తుంది. గమనించండి.

Updated On 1 May 2023 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story