ఐ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అంటున్నారు డాక్టర్లు . ఇది ఆప్టిక్ నరాల ముందు భాగంలోని కణజాలాలకు తగినంత రక్త ప్రవాహం లేకపోవడం వల్ల సంభవిస్తుందంటున్నారు ఐ స్పెషలిస్టులు.

ప్రస్తుత రోజుల్లో ఎప్పుడు ఏ రోగం అటాక్ చేస్తుందో చెప్పలేము ..అందుకే మంచి హెల్తీ పుడ్ తింటూ ...ఆరోగ్యాన్నికాపాడుకోవాలంటున్నారు డాక్టర్స్.. హార్ట్‌ స్ట్రోక్‌, బ్రెయిన్ స్ట్రోక్‌ లాగానే ఈ జాబితాలో మరో స్ట్రోక్ యాడ్ అయ్యింది ..అయితే ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ కు చాలా మంది చనిపోవడం మనకు తెలిసిన విషయమే . ఇప్పుడు మరొక కొత్తరకం స్ట్రోక్ ఆందోళనకు గురిచేస్తుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీర భాగాల్లో ఎంతో ముఖ్యమైనవి కళ్లు..చాలా మంది కళ్ల విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఇప్పటి వరకు కంటి చూపుకు సంభందించిన ఎన్నో సమస్యలను చూసి ఉంటాం.. కానీ ఇప్పుడు ఐ స్ట్రోక్‌ లు అటాక్ లు చేస్తున్నాయి . ఐ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అంటున్నారు డాక్టర్లు . ఇది ఆప్టిక్ నరాల ముందు భాగంలోని కణజాలాలకు తగినంత రక్త ప్రవాహం లేకపోవడం వల్ల సంభవిస్తుందంటున్నారు ఐ స్పెషలిస్టులు . కంటి స్ట్రోక్‌ని రెటీనా ఆర్టరీ అక్లూజన్ అంటారు. నొప్పి లేకుండానే ఉదయం నిద్రలేవగానే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందట. దృష్టిలో అస్పష్టత, చీకటి, నీడలు లాంటి ఆకస్మిక మార్పులకు దారితీయ్యడం దీని సంకేతాలు. ఇది తరచుగా ఒక కంటిలో మాత్రమే కనిపిస్తుంది. . కంటి స్ట్రోక్‌తో బాధపడుతున్న చాలా మంది ఉదయం నిద్రలేవగానే ఒక కంటి చూపు కోల్పోవడాన్ని గమనిస్తారు. ఎలాంటి నొప్పిలేకుండానే ఇది జరుగుతుంది.
దృష్టిలో అస్పష్టత, చీకటి, నీడలు లాంటి ఆకస్మిక మార్పులకు దారితీయ్యడం దీని సంకేతాలు.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తగినంత ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తినడం, రక్తంలో చక్కెర, ఒత్తిడి స్థాయిలను చెక్‌ చేసుకోవడం మంచిదంటున్నారు . స్మోకింగ్‌ చేయడం , మద్యం సేవించడం తగ్గించాలి అంటున్నారు డాక్టర్స్. ముఖ్యమైన కార్డియోవాస్క్యులార్ వ్యాధి ఉన్నవారు ఈ ఐ స్ట్రోక్ బారిన పడే అవకాశాలున్నాయిని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వయస్సు 50 లేదా అంతకంటే ఎక్కువ, అధిక రక్తపోటు కలిగి ఉండటం, డయాబెటిస్, గ్లాకోమా ప్రాబ్లెమ్స్‌ ఉన్నవాళ్లు ఈ ఐ స్ట్రోక్‌కు రిస్క్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. అకస్మాత్తుగా దృష్టి కోల్పోయే వ్యక్తులు వెంటనే, ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. తరచుగా కంటికి మసాజ్ చేయడం ద్వారా గడ్డకట్టడాన్ని కంటి స్ట్రోక్‌ను నాలుగు గంటలలోపు నిర్ధారణ చేసే వీలుంటుంది.

Updated On 14 March 2023 2:31 AM GMT
Ehatv

Ehatv

Next Story