పదేళ్ల వయసులోనే ఆ చిన్నారికి ప్రాణాంతకమైన కేన్సర్‌(Cancer) వ్యాధి సోకింది. బిడ్డను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. ఆ పాప జీవితంలో కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్న చేదు నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక డాక్టర్లు తల్లడిల్లారు. ధైర్యం చేసి ఆ మాట చెప్పారు. అది విని పాప తల్లిదండ్రులు నిలువునా కుప్పకూలారు. కళ్లముందే కూతురు మరణానికి చేరువవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత వారిది! గుండెను దిటవు చేసుకున్నారు.

పదేళ్ల వయసులోనే ఆ చిన్నారికి ప్రాణాంతకమైన కేన్సర్‌(Cancer) వ్యాధి సోకింది. బిడ్డను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. ఆ పాప జీవితంలో కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్న చేదు నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక డాక్టర్లు తల్లడిల్లారు. ధైర్యం చేసి ఆ మాట చెప్పారు. అది విని పాప తల్లిదండ్రులు నిలువునా కుప్పకూలారు. కళ్లముందే కూతురు మరణానికి చేరువవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత వారిది! గుండెను దిటవు చేసుకున్నారు. ఆఖరి రోజుల్లో కూతురును సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నారు. కోరికలన్నీ తీర్చాలనుకున్నారు. తనకు పెళ్లి కావాలంటూ ఎప్పుడూ చెప్పే ఆ చిన్నారి కోరికను నెరవేర్చాలనుకున్నారు. ఆమెకు అత్యంత ఘనంగా పెళ్లి చేశారు. హృదయాలను పిండేసే ఈ ఘటన అమెరికాలోని(america) నార్త్‌ కరొలినాలో(North corolina) జరిగింది. అలీనా(alina), ఆరోన్‌ ఎడ్వర్డ్స్‌(Aaron Edwards) దంపతులకు పదేళ్ల కిందట ఎమ్మా ఎడ్వర్డ్స్‌(Emma Edwards) జన్మించింది. పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్నారు.

అయితే కొన్నాళ్ల కిందట పాప అనారోగ్యం బారిన పడింది. వైద్య పరీక్షలో ఆమెకు కేన్సర్‌ ఉన్నట్లు తేలింది. ఆమెను కాపాడుకోవడానికి ఆసుపత్రులన్నీ తిరిగారు. లాభం లేకపోయింది. లిమ్ఫోల్బా స్టిక్‌ లుకేమియాతో(leukemia) బాధపడుతున్న ఆ పాప ఆ భయంకరమైన రోగం నుంచి బయటపడుతుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇక కొద్ది రోజులు మాత్రమే ఆమె బతికి ఉంటుందన్న విషయం తెలిసింది. మరణానికి చేరువవుతున్న ఆ పాన తన పెళ్లి కల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. తన స్నేహితుడు డీజేను పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది. దీంతో ఎమ్మా తల్లి డీజే తల్లిదండ్రులతో మాట్లాడింది. వారిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేసింది. పెళ్లి మాటలు మాట్లాడుకున్న రెండు రోజులకే అంటే జూన్‌ 29న పెద్ద ఎత్తున బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. ఇది జరిగిన 12 రోజులకే పరిస్థితి విషమించి ఆ చిన్నారి కన్నుమూసింది.

Updated On 9 Aug 2023 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story