Smart Mask : స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ ఫోన్లే కాదండోయ్.. స్మార్ట్ మాస్కులు కూడా..!
స్మార్ట్ ఫోన్లు(smart phone), స్మార్ట్ వాచ్‌లు(smart Watch) అని విన్నాం. మార్కెట్లోకి కొత్తగా మరో పదం వచ్చింది. అదే 'స్మార్ట్ మాస్క్'(Smart Mask)
కోవిడ్-19(Covid 19) విజృంభిస్తున్న సమయంలో మనం మళ్లీ మాస్కులు(Mask) ధరించాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. ఇదే అదునుగా భావించిన కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు స్మార్ట్ వాచ్‌ల పేరుతో పలు మోడల్స్‌లో మార్కెట్లోకి వదిలాయి. ఎయిర్ ప్యూరిఫైర్, బ్యాటరీ, యూస్‌బీ, ఇతర ఫీచర్లతో స్మార్ట్ మాస్కులను విడుదల చేశాయి.

Smart Mask
స్మార్ట్ ఫోన్లు(smart phone), స్మార్ట్ వాచ్‌లు(smart Watch) అని విన్నాం. మార్కెట్లోకి కొత్తగా మరో పదం వచ్చింది. అదే 'స్మార్ట్ మాస్క్'(Smart Mask)
కోవిడ్-19(Covid 19) విజృంభిస్తున్న సమయంలో మనం మళ్లీ మాస్కులు(Mask) ధరించాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. ఇదే అదునుగా భావించిన కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు(Electronic companies) స్మార్ట్ వాచ్‌ల పేరుతో పలు మోడల్స్‌లో మార్కెట్లోకి వదిలాయి. ఎయిర్ ప్యూరిఫైర్, బ్యాటరీ, యూస్‌బీ, ఇతర ఫీచర్లతో స్మార్ట్ మాస్కులను విడుదల చేశాయి. పలు రకాల స్మార్ట్ మాస్కులపై మచ్చుకు మనమూ ఓ లుక్కేద్దామా..
ACM067/01తో ఫిలిప్స్ ఫ్రెష్ ఎయిర్ యాంటీ పొల్యూషన్ మాస్క్ దీని ధర రూ. 6,495. ఈ మాస్కులో 4 సార్లు ఫిల్టర్ చేసే ఫీచర్ ఉండడమే కాకుండా 95% హానికరమైన కాలుష్య కారకాలు, అలెర్జీ కారకాలను తొలగిస్తుందని ఫిలిప్స్ కంపెనీ చెప్తోంది. ఇది తేమ, CO2 స్థాయిలను తగ్గిస్తుందని, ఇందులో ఫ్యాన్ మాడ్యూల్ ఉంటుంది. వినియోగదారులు ఫ్యాన్ వేగాన్ని కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందటండీ..
వీనస్ V-999 ఫుల్ ఫేస్ మాస్క్ + V-7900 ABEK1 P2R: దీని ధర అక్షరాల రూ. 8 వేలు
ఈ మాస్క్ పునర్వినియోగ ఫిల్టర్ కాట్రిడ్జ్‌లతో ఉంది. సిలికాన్ ఎగ్జాలేషన్ వాల్వ్‌తో పాటు మాస్క్ యొక్క బెల్ట్‌ను సర్దుకునే అవకాశం కల్పించారు. ఇది ఎక్కువ గంటలు ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది.
HRmed డీలక్స్ స్మార్ట్ ఎలక్ట్రిక్ యాంటీ పొల్యూషన్ ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ ప్యాక్ దీని ధర రూ. 5,999.
ఈ మాస్క్ మనల్ని.. హానికరమైన దుమ్ము, కాలుష్యం, బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుందనట. ఇది నాలుగు-పొరల మిశ్రమ ఫిల్టర్‌ను కలిగి ఉండడమే కాకుండా.. అన్ని మలినాలను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను మనకు అందిస్తుందని అంటున్నారు.
OxiClear N99: 4 యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్‌లతో కూడిన యాంటీ పొల్యూషన్ ఫేస్ మాస్క్ దీని ధర రూ. 499.
PM 2.5 కణాలు, పుప్పొడి, బాక్టీరియా నుంచి రక్షణను అందిస్తుంది. ఈ మాస్క్‌లో కార్బన్ ఫిల్టర్ బ్యాక్టీరియా పేరుకుపోకుండా నిరోధిస్తుందని పేర్కొంది.
