మనిషికి తిండి లేకుండా అయినా..కొన్ని రోజులు బ్రతగకగడడేమో కాని.. నిద్ర లేకుండా ఎక్కువకాలం బ్రతకడం కష్టం. మంచి ఆరోగ్య కరమైన నిద్ర మనిషికి ఎంతో ముఖ్యం. మరి మీకు నిద్ర కరెక్ట్ గా ఉంటుంది. ఒక వేళ నిద్ర సరిగ్గా లేకుంటే కలిగే నష్టాలు మీకు తెలుసా? అసలు మనిషికి ఎంత నిద్ర ఉండాలి..? నిద్ర లేకపోతే కలిగే నష్టాలేంటి చూద్దాం.. ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం.నిద్రలేకుంటే మనిషికి పిచ్చిపట్టినట్టు ఉంటుంది. ఏపని చేయలేరు. చిరాకు కోపం పెరిగిపోతుంది. ప్రతీ చిన్న విషయానికి కోపగించుకోవడం.
మనిషికి తిండి లేకుండా అయినా..కొన్ని రోజులు బ్రతగకగడడేమో కాని.. నిద్ర లేకుండా ఎక్కువకాలం బ్రతకడం కష్టం. మంచి ఆరోగ్య కరమైన నిద్ర మనిషికి ఎంతో ముఖ్యం. మరి మీకు నిద్ర కరెక్ట్ గా ఉంటుంది. ఒక వేళ నిద్ర సరిగ్గా లేకుంటే కలిగే నష్టాలు మీకు తెలుసా? అసలు మనిషికి ఎంత నిద్ర ఉండాలి..? నిద్ర లేకపోతే కలిగే నష్టాలేంటి చూద్దాం..
ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం.నిద్రలేకుంటే మనిషికి పిచ్చిపట్టినట్టు ఉంటుంది. ఏపని చేయలేరు. చిరాకు కోపం పెరిగిపోతుంది. ప్రతీ చిన్న విషయానికి కోపగించుకోవడం. మనిషిమీద అరవడం లాంటివి చేస్తుంటారు. అసలు నిద్ర లేకపోతే...మనిషి కళ్ళు గుంటలుపడి.. నల్లటి చారలు కంటి కింద పెరిగిపోతాయి. అయితే ప్రతీ మనిషికి నిద్ర ఎంతసేపు ఉండాలి.
ఆరోగ్యంగా ఉండాలి అంటే.. ప్రతీ మనిషికీ.. దాదాపు 7 నుండి 8 గంటల డీప్ స్లీప్ ఉండాలి. కలత నిద్ర కూడా ఆరోగ్యానికి అంత మంచిదికాదు. నిద్ర మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి సరిగ్గా నిద్రపోకపోతే, అతని మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు అంటున్నారు. సరైన నిద్ర లేకపోవడం మన శరీరాన్ని అనేక రోగాలు ఆవాసంగా చేసుకుంటాయి.
ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు నిద్ర లేమి కారణంగా వస్తాయి. ఇక ఇందులో ఆశ్చార్య కరంగా ఆస్తమా కూడా నిద్రలేమి కారణంగా వస్తుంది తెలుస్తోంది. రీసెంట్ రీసెర్చ్ ప్రకారం సరైన నిద్ర లేని వ్యక్తి ఆస్తమాతో బాధపడే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
ప్రతిరోజూ సరైన సమయానికి పడుకోవడం, ఉదయం సరైన సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోండి. దీని వల్ల్ నిద్ర సమస్యల నుంచి మీరు బయట పడతారు. పెద్దవారికి ఆరోగ్యకరమైన జీవితానికి 7 నుండి 8 గంటల మంచి నిద్ర అవసరం. పిల్లలు 12 గంటల వరకు నిద్ర ఉండాలి.
మంచి నిద్ర వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంది.కెఫిన్, నికోటిన్, అధిక ఆహారం తీసుకోవడం నిద్రను ప్రభావితం చేస్తుంది. వాటిని తగ్గించాలి. రాత్రిపూట మొబైల్ ఫోన్ వాడకం తగ్గించాలి. నిద్రపోవడానికి 30 నిమిషాల ముందు మీ ఫోన్‌పక్కన పెట్టేయండి. మంచి నిద్ర.. ఆరోగ్య సూచకం. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయకండి.. ఆరోగ్యాన్ని కోల్పోకండి.