ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాహారానికి మంచి మూలంగా పనిచేస్తాయి.

ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాహారానికి మంచి మూలంగా పనిచేస్తాయి. మరీ ముఖ్యంగా పాలకూర తినడం వల్ల శరీరానికి, ముఖ్యంగా కంటికి చాలా మంచిది. పాలకూరను ఎక్కువగా తినేవారు ఉంటారు. అయితే పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, సోడియం, ఫాస్పరస్, ఐరన్, క్లోరిన్, ప్రొటీన్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి వంటి విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

పాలకూర ఆకులను ఎక్కువగా తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది , రక్తహీనత నివారిస్తుంది. అయితే చలికాలంలో ఎక్కువగా తినకూడదు. అలా తింటే మేలు జరగడం కంటే.. శరీరానికి కీడే ఎక్కువ జరుగుతుందట. . చలికాలంలో పాలకూరను ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసుకుందాం.

పాలకూరలోని ఆక్సాలిక్ యాసిడ్ దాని సహజ స్థాయిని మించిపోయినప్పుడు, అది ఇతర ఖనిజాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఆమ్లం మెగ్నీషియం, కాల్షియం మరియు జింక్‌తో బంధిస్తుంది అంతే కాదు శరీరంలో ఖనిజ లోపానికి కారణమవుతుంది. ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

చలికాలంలో పాలకూర ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అలసట వస్తుంది. ఇది ఎక్కువగా తినడం వల్ల మనిషి శక్తిని కోల్పోతాడు. దీంతో రోజంతా బద్ధకంగా ఉంటాడు.

పాలకూరలో హిస్టామిన్ ఉంటుంది. ఇది శరీరంలోని కొన్ని కణాలలో కనిపించే ఒక రకమైన రసాయనం. కొన్నిసార్లు ఇది శరీరంలో అలర్జీని కలిగిస్తుంది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి చలికాలంలో పాలకూరను ఎక్కువగా తినకండి.

పాలకూరలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలికాలంలో దీన్ని ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది కాకుండా, జీర్ణక్రియ కూడా ప్రభావితమవుతుంది.

ఇక కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు పాలకూర ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారు పాలకూర ఎక్కువగా తింటే అందులోని ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అప్పుడు శరీరం నుండి వదిలించుకోవటం చాలా కష్టం. ఇది కిడ్నీలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది కిడ్నీ స్టోన్ సమస్యను మరింత పెంచుతుంది.

వీళ్లే కాదు... కీళ్ల నొప్పులతో బాధపడేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు, ఇతర వ్యాధులకు మందులు వాడేవారు చలికాలంలో పాలకూర తినకూడదు. అలా కాదని ఎక్కువగా తింటే శరీరానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

ehatv

ehatv

Next Story