ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చిన్న వయసులోనే తెల్ల జుట్టు(White Hair) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తెల్ల జుట్టు ఒత్తిడి, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, శరీరంలో పోషకాహార లోపం వల్ల రావచ్చు. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు కొన్ని అమ్మమ్మ చిట్కాలు పాటిస్తే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చిన్న వయసులోనే తెల్ల జుట్టు(White Hair) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తెల్ల జుట్టు ఒత్తిడి, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, శరీరంలో పోషకాహార లోపం వల్ల రావచ్చు. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు కొన్ని అమ్మమ్మ చిట్కాలు పాటిస్తే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాలలో ఒకటి.. ముక్కులో నెయ్యి(Ghee) వేయడం.. ఇది ఆయుర్వేదంలో(Ayurvedam) ఒక రకమైన చికిత్స. ఇది అనేక సమస్యలను నయం చేస్తుంది. కాబట్టి.. ఈ రోజు జుట్టు కోసం ఈ పద్ధతి గురించి తెలుసుకుందాం.

ఆయుర్వేదంలో ముక్కులో ఏదైనా వేసుకునే విధానాన్ని నాస్య విధి అంటారు. ఈ ప్రక్రియ ఒత్తిడిని తగ్గించడం ద్వారా శరీరంలోని అనేక పరిస్థితులను సరిచేస్తుంద‌ని చెప్తుంటారు. నల్ల జుట్టు విషయానికి వస్తే.. ఈ పద్ధతి మీ జుట్టు తెల్లగా మారడానికి గల కొన్ని కారణాలను తొలగిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించ‌డంతో పాటు.. శరీరాన్ని నిర్విషీకరణ(శరీర వ్యవస్థ నుండి విషాన్ని తొలగించటం) చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నిద్ర సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఈ విధంగా.. ఇది కొత్త, నల్లని జుట్టును పొందడానికి.. అలాగే నెరిసిన జుట్టు సమస్యను తగ్గిస్తుంది.

ముక్కులో నెయ్యి(Ghee) వేసుకుంటే చాలా రకాలుగా పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ తెరిచి.. వాటిని పోషించి, జుట్టును నల్లబ‌రచ‌గ‌ల‌దు. ఆవు నెయ్యిలో కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కొల్లాజెన్‌ని పెంచి.. దాని ఛాయను మెరుగుపరుస్తుంది. అంతే కాదు, స్కల్ప్‌లోని తేమను మూసివేసి.. జుట్టు ఆరోగ్యవంతంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా ఈ ప్ర‌క్రియ‌ తెలుపు జుట్టుకు చాలా ప్రభావవంతమైన నివారణగా మారుతుంది.

కాబట్టి, మీరు చేయాల్సిందల్లా నిద్రపోయే ముందు ఈ నాస్య విధిని ట్రై చేయండి. దీని కోసం.. 1 టీ స్ఫూన్‌ లో ఆవు నెయ్యి తీసుకొని దానిని కరిగించండి. కొద్దిగా ఊపిన‌ తర్వాత.. ముక్కు రంధ్రాలలో 2 చుక్కలు వేయండి. ఈ పనిని ప్రతిరోజూ రాత్రిపూట చేయండి. కొద్ది రోజుల్లోనే మీరు మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు.

Updated On 5 April 2023 11:22 PM GMT
Ehatv

Ehatv

Next Story