ప్రస్తుతం విశ్రాంతి లేని జీవనశైలికి వ్యాయమం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి వ్యాయమం(exercise) చేయడానికి సమయం ఉండదు. అలా కాకుండా.. ఉదయాన్నే ఒక 20 నిమిషాలపాటు నడిస్తే(Walking) ఆరోగ్యానికి మంచింది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో(empty Stomach) 20 నుండి 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అది మీ శరీరంపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుందని అంటారు నిపుణులు.
ప్రస్తుతం విశ్రాంతి లేని జీవనశైలికి వ్యాయమం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి వ్యాయమం(exercise) చేయడానికి సమయం ఉండదు. అలా కాకుండా.. ఉదయాన్నే ఒక 20 నిమిషాలపాటు నడిస్తే(Walking) ఆరోగ్యానికి మంచింది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో(empty Stomach) 20 నుండి 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అది మీ శరీరంపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుందని అంటారు నిపుణులు. నడక అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శారీరక ఆరోగ్యంతో(Physical Health) పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే నిద్రలేవగానే నడకకు వెళితే మానసికంగా, శారీరకంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం అల్పాహారం తీసుకోకుండా ఇంటి నుండి బయటకు వచ్చి బాగా నడవడం వలన ఒత్తిడి(Pressure), నిరాశ, నిద్రలేమి సమస్యను కూడా తగ్గిస్తుంది. WebMD ప్రకారం.. ప్రతిరోజూ 20 నుండి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు నడిస్తే, అది మీ మానసిక ఆరోగ్యానికి టానిక్ లాగా పనిచేస్తుంది. కనీసం 5 రోజులు ఉదయం నడిస్తే.. దాని ఫలితం కనిపిస్తుంది, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇది మాత్రమే కాదు ఉదయం వాకింగ్ చేస్తే, అది మీ సృజనాత్మకతను పెంచడానికి కూడా పనిచేస్తుంది. ఉదయాన్నే లేచి వాకింగ్‌కు వెళితే సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. నడక ద్వారా రాత్రి మంచి నిద్ర వస్తుంది. దీని వలన ఉదయం మానసిక స్థితి కూడా బాగుంటుంది. ఉదయాన్నే నడకకు వెళ్లి కొంత వ్యాయామం చేయడం వంటివి చేస్తే, శరీరం నుండి డోపమైన్ అనే హార్మోన్ విడుదలై ఒత్తిడిని తగ్గించి డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. ఇది మాత్రమే కాదు విడుదలయ్యే సెరోటోనిన్ హార్మోన్ మంచి నిద్రను కలిగిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
మార్నింగ్ వాక్ కూడా మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి నడిచేటప్పుడు స్త్రీల శరీరం నుండి ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ మెనోపాజ్ అలసట, విచారం, ఒత్తిడి మొదలైన లక్షణాలను సులభంగా తొలగిస్తుంది. ఇది కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యంగా ఉంచడం, కీళ్ల సమస్యలను దూరంగా కండరాలను బలోపేతం చేయడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహయపడుతుంది. అందువల్ల ప్రతిరోజూ ఉదయం నడక కోసం కాస్త సమయం కేటాయించడం ద్వారా జీవితమంతా ఆరోగ్యంగా జీవిస్తారు.