ఆరోగ్యానికి కావాల్సిన పోషకాహారం డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. చూడటానికి అవి చిన్నగా ఉన్నా అందులోని ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి శక్తినిస్తాయి. సహజంగా తీసుకునే ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించడంతో డ్రైఫ్రూట్స్ ఎంతో ఉపయోగపడతాయి. వీటి వల్ల రక్త ప్రసరణ మెరుగు పడటంతో పాటు జీవక్రియ చురుగ్గా ఉంటుంది. గుండె , మెదడు ఆరోగ్యంగా ఉంటాయి . చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ఎంతో సహకరిస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అదే పనిగా […]

ఆరోగ్యానికి కావాల్సిన పోషకాహారం డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. చూడటానికి అవి చిన్నగా ఉన్నా అందులోని ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి శక్తినిస్తాయి. సహజంగా తీసుకునే ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించడంతో డ్రైఫ్రూట్స్ ఎంతో ఉపయోగపడతాయి. వీటి వల్ల రక్త ప్రసరణ మెరుగు పడటంతో పాటు జీవక్రియ చురుగ్గా ఉంటుంది. గుండె , మెదడు ఆరోగ్యంగా ఉంటాయి . చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ఎంతో సహకరిస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అదే పనిగా ఎక్కువ తీసుకుంటే మాత్రం అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. . ఈ డ్రైప్రూట్స్ ని తినడం వల్ల ప్రయోజనాలతో పాటు రోజు ఏ మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.

బాదం పప్పు....
డ్రైఫ్రూట్స్ లో మొదటిగా చెప్పుకునేది బాదం పప్పు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉండటం వల్ట అధిక ప్రయోజనాలు ఇస్తుంది. రాత్రి నానబెట్టుకుని ఉదయం పూట తింటే ఎన్నో లాభాలు ఉంటాయి.
బాదంపప్పులు తీసుకోవడం వల్ల మధుమేహం, బలహీనత వంటి కొన్ని సమస్యలను నివారించడంలో సహాయపడవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, స్థూలకాయం, ప్రీడయాబెటిస్ మెటబాలిక్ సిండ్రోమ్ వంటి క్లినికల్ డిజార్డర్స్‌తో సంబంధం ఉన్న ప్రమేహ (డయాబెటిస్) పరిస్థితులలో బాదం సహాయపడుతుంది. బాదంపప్పును రోజువారీగా తీసుకోవడం వల్ల శరీర కణజాలాలకు తేమను అందిస్తుంది, చర్మం రంగు మెరుగుపరుస్తుంది. బాదం మొత్తం చర్మ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, తెల్ల జుట్టు, జుట్టు రాలడాన్ని కూడా నయం చేస్తుంది.బాదం వినియోగం పునరుత్పత్తి శక్తిని పెంచుతుంది. శృంగార సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ బాదం తినాలని సిఫార్సు చేయబడింది.
అయితే వీటిని రోజుకు 4నుంచి 7 బాదం పప్పులు మాత్రమే తీసుకోవాలి.

వాల్ నట్స్...
వాల్‌నట్స్‌లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, రాగి, సెలీనియం, ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అనేక ప్రయోజనాలు ఉన్నందున, వాల్ నట్స్ ను డ్రైఫ్రూట్స్ లో రాజు అని కూడా పిలుస్తారు. అలాగే వాల్‌నట్ మెదడు ఆరోగ్యానికి జ్ఞాపకశక్తికి బాగా ఉపయోగపడుతుంది. వాల్ నట్స్ దగ్గు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయట పడేస్తుంది. బరువు తగ్గించడంలో కూడా ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. వాల్ నట్స్ ను పచ్చిగా తినడానికి బదులు నానబెట్టి తింటే, దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. నానబెట్టిన వాల్ నట్స్ ను అనేక వ్యాధుల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. వాల్నట్ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు చెపుతున్నాయి. రోజూ 2 నుంచి 3 వాల్ నట్స్ ను తినేవారిలో టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. నానబెట్టిన వాల్ నట్స్ ను తినడం వల్ల ఆరోగ్యాన్ని మంచిగా ఉంచడమే కాకుండా స్పెర్మ్ ఆరోగ్యం సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. వాల్ నట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు వీటిని 3 నుంచి 4 వాల్ నట్స్ మాత్రమే తినాలి.

పిస్తా ప‌ప్పు...
మ‌న‌ం తినే అనేక ర‌కాల న‌ట్స్ లో పిస్తా ప‌ప్పు కూడా ఒక‌టి. పిస్తా ప‌ప్పులు మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. వీటిల్లో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఈ ప‌ప్పుల్లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. వాస్తవానికి పిస్తాపప్పులు కార్డియోప్రొటెక్టివ్ కార్యకలాపాలను కలిగి ఉంటాయి, ఇది గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది . అందువల్ల, గుండె జబ్బులను నివారించడానికి క్రమం తప్పకుండా పిస్తా తినవచ్చు.
అధిక బ‌రువును త‌గ్గించేందుకు, గుండెను, జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచే పోష‌కాలు ఈ ప‌ప్పుల్లో అధికంగా ఉంటాయి. బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పు కంటే ఆహారంలో తక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఇప్పటికీ దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పిస్తాపప్పులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది , విటమిన్ ఎ మొత్తం కంటి ఆరోగ్యానికి చురుకైన విటమిన్‌గా పనిచేస్తుంది. అందువల్ల, మీరు కళ్ళకు సంబంధించిన సమస్యలను నివారించాలనుకుంటే, ఖచ్చితంగా పిస్తా తినండి. నిత్యం రెండు గుప్పెళ్ల మోతాదులో 12 వారాల పాటు పిస్తాప‌ప్పును తింటే ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు 20 నుంచి 30 శాతం వ‌ర‌కు త‌గ్గాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువల్ల డ‌యాబెటిస్ ఉన్న వారు వీటిని నిత్యం తింటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. అయితే ఈ ఫిస్తాను ప్రతిరోజు 20 గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది.

జీడిపప్పు :
జీడిపప్పులో ఆరోగ్యాన్ని కాపాడే మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, జింక్, పొటాషియం, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. జీడిపప్పులో కొలెస్ట్రాల్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండటం వల్ల గుండె జబ్బుల నుండి దూరంగా ఉంచుతుంది. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.జీడిపప్పులో ఉండే పోషక పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును వాపును తగ్గిస్తుంది. అదే సమయంలో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీడిప‌ప్పును అతిగా తింటే మాత్రం అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు 4 జీడిపప్పును తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

ఎండు ఖర్జురా
ఎండు ఖర్జురాల్లో ఐరన్ కంటెంట్ మరియు ఫ్లోరైన్ అత్యధికంగా ఉంటుంది. ఎండు ఖర్జూరాల్లో విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. డేట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇవి తినడానికి తియ్యగా ఉంటాయి. ఎండు ఖర్జూరాలను నేరుగా తినడం కంటే నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపు తిని, ఆ నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
ఎండు ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ ఉండదు, చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. .. ఇవి కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని రోజుకు 2 మాత్రమే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది .

Updated On 4 March 2023 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story