ప్రజా ఆరోగ్యం సిద్ధార్థ(Health assemble) యోగ విశ్వవిద్యాలయం గత 24 ఏళ్లుగా చేస్తున్న సేవలు మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా జనవరి 21న నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమంలో భారత జాతీయ ఆరోగ్య సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని రామచంద్రరావు(Ramachandra Rao) అన్నారు.

ప్రజా ఆరోగ్యం సిద్ధార్థ(Health assemble) యోగ విశ్వవిద్యాలయం గత 24 ఏళ్లుగా చేస్తున్న సేవలు మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా జనవరి 21న నేలకొండపల్లి(Nelakondapalli) ప్రకృతి ఆశ్రమంలో(Prakruthi Ashramam) భారత జాతీయ ఆరోగ్య సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని రామచంద్రరావు(Ramachandra Rao) అన్నారు. భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమాన్ని ప్రకృతి సహజ పద్ధతుల ద్వారా సుదీర్ఘ కాలంగా బాధపడుతున్నషుగర్, బీపీ, థైరాయిడ్(Thairoid), లివర్‌ ట్రాన్సాప్లాంటేషన్, కిడ్నీ ఫెయిల్యూర్(Kidney failure), క్యాన్సర్‌లాంటి రుగ్మత లనుంచి బయటపడేసుకునేందుకు మనం ఎలాంటి పద్ధతులు అవలంభించాలన్న దానిపై ఈ సమ్మేళనంలో విస్తృత చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులకు సహజ వంటకాలు, మిల్లెట్స్‌ ద్వారా భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు. భారత జాతీయ పురాతన క్రీడ అయినటువంటి మల్కం క్రీడా ప్రదర్శన ఉంటుంది. తాడు మీద యోగా ప్రదర్శనలు, ఇతర సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆరోగ్య అభిలాషులు, ప్రకృతి ప్రేమికులంతా కూడా 21న జరిగే భారత జాతీయ ఆరోగ్య సమ్మేళనానికి నేలకొండపల్లి ఆశ్రమానికి విచ్చేసి ఆరోగ్య ఉద్యమంలో మీ వంతు పాత్రను పోషించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాని రామచంద్రరావు అన్నారు.

Updated On 18 Jan 2024 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story