సీజన్ తో సంబంధం లేకుండా వస్తున్న జలుబు దగ్గు జ్వరాలు గురించి ఇప్పుడు సర్వత్ర ఆందోళన నెలకొంది.. ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. అసలు ఏ కారణాల వల్ల జ్వరం వస్తుందో తెలియని ఆందోళనలను ప్రజలు ఉన్నారు.. దేశంలో పెరుగుతున్న ఈ సీజనల్ ఫీవర్ కేసుల గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాంటీబయోటిక్స్ వాడకంపై ఒక హెచ్చరికను జారీ చేసింది..సీజన్ పరంగా వచ్చే ఫీవర్ జలుబు దగ్గు వంటి వాటితో బాధపడుతున్న వారికి యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదని […]

సీజన్ తో సంబంధం లేకుండా వస్తున్న జలుబు దగ్గు జ్వరాలు గురించి ఇప్పుడు సర్వత్ర ఆందోళన నెలకొంది.. ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. అసలు ఏ కారణాల వల్ల జ్వరం వస్తుందో తెలియని ఆందోళనలను ప్రజలు ఉన్నారు.. దేశంలో పెరుగుతున్న ఈ సీజనల్ ఫీవర్ కేసుల గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాంటీబయోటిక్స్ వాడకంపై ఒక హెచ్చరికను జారీ చేసింది..సీజన్ పరంగా వచ్చే ఫీవర్ జలుబు దగ్గు వంటి వాటితో బాధపడుతున్న వారికి యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదని వైద్యులకు సూచించింది

సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజులు లక్షణాలు కనిపించే జలుబు దగ్గు జ్వరం వంటి రోగాలకు ఇన్‌ఫ్లుఎంజా ఎ సబ్‌టైప్‌ హెచ్3ఎన్2 అని వైరస్ ద్వారా ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వ్యక్తులు దగ్గు, వాంతులు, గొంతు నొప్పి, జ్వరం అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.మూడు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది ఆ తర్వాత క్రమంగా దగ్గు వంటివి తగ్గడం మొదలుపెడతాయి.. కాబట్టి ఇలాంటి వారికి యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఐఎంఏ వైద్య నిపుణులను కోరింది
అధిక మోతాదు లో యాంటీబయోటిక్స్ ని ఉపయోగించడం వల్ల రెసిస్టెన్స్ కి దారి తీసే అవకాశం ఉందని చెబుతున్నారు.

డయేరియా, UTI కోసం ఉపయోగిస్తు అమోక్సిసిలిన్ , నార్ఫ్లోక్సాసిన్, సిప్రోఫ్లోక్సాసిన్, ఆఫ్లోక్సాసిన్, లెవోఫ్లోక్సాసిన్ వంటి యాంటీబయాటిక్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని,ఇలానే అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను covid సమయం లో ఎక్కువగా వాడటం జరిగింది . ఇది కూడా రెసిస్టెన్స్‌కు దారితీసిందని తెలిపింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్‌ఫెక్షన్‌ బ్యాక్టీరియానా కాదా అని నిర్ధారించి యాంటీబయాటిక్స్‌ను అవసరం మేరకు మాత్రం సూచించాలని తెలిపింది .

సాధారణమైన ఇన్ఫెక్షన్స్ వలన జ్వరం దగ్గు జలుబు వంటి వాటిని చేసుకోవడం ద్వారా బహిరంగ ప్రదేశాలలో మార్గ ధరించడం ద్వారా కంట్రోల్ చేయవచ్చునని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ సూచించింది.

Updated On 4 March 2023 6:39 AM GMT
Ehatv

Ehatv

Next Story