పరిస్థితుల వలనో.. బంధాల వలనో జీవితంలో కొన్ని సార్లు మూడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అలాంటి మానసిక ఒత్తిడి(Mental Pressure) నుంచి.. మనోవేదన నుంచి బయటపడాలంటే.. కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ ఉండాలి. పైగా అవి చాలా సింపుల్ చిట్కాలే. ఏం లేదండి, చక్కగా ఇంటినే అహ్లాదంగా మార్చుకోండి.

పరిస్థితుల వలనో.. బంధాల వలనో జీవితంలో కొన్ని సార్లు మూడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అలాంటి మానసిక ఒత్తిడి(Mental Pressure) నుంచి.. మనోవేదన నుంచి బయటపడాలంటే.. కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ ఉండాలి. పైగా అవి చాలా సింపుల్ చిట్కాలే. ఏం లేదండి, చక్కగా ఇంటినే అహ్లాదంగా మార్చుకోండి. ఎలాంటి ఖర్చు అవసరం లేకుండా ఇంటిని ఎలా బృందావనంలా మార్చుకోవాలి? క్షణాల్లో ఎలా సంతోషంగా మార్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

స్వచ్ఛమైన గాలి వెలుతురు..
ఎంతైనా ఎండ(sun light), వెలుతురు వచ్చే ఇంట్లో.. ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకూ తలుపులు ఓపెన్ పెట్టుకుని ఉంచుకోవాలి. దోమల(Mosquitoes) బెడద, భద్రత సమస్యలు ఉన్నప్పుడు.. నెట్ డోర్స్(Night doors), వెంటిలేషన్ వచ్చే ఇనుపు తలుపులు పెట్టించుకోవడం మంచిది.
ఏదొక పూట సూర్యరశ్మి ఇంట్లో పడేలా చూసుకోవాలి. అప్పుడే జీవితం చాలా కూల్‌గా సాగిపోతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది.

అన్నీ మారుస్తూ ఉండండి
ఇంట్లో నిత్యం ఒకే కలర్ గోడలు, కర్టెన్స్, పిల్లోస్ చూసి చూసి బోరు కొడుతూ ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా కర్టెన్స్(curtains), బెడ్ షీట్స్(bedsheets) మారుస్తూ ఉండాలి. అది ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇక గోడకు ఎందుకునే రంగుల్లో కొంత ప్రకాశవంతమైన రంగుల్నే ఎంచుకుంటే.. మనసు పాజిటివ్‌‌గా ఉంటుంది.

మొక్కలు(Plants) పెంచండి
బాల్కనీ(Balcony0 లేదా టెర్రస్‌పై ఇంట్లో వెలుతురు వచ్చే చోట.. మొక్కల్ని పెంచే అలవాటు.. మనసుకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. పుష్పించే పువ్వులు.. పచ్చని ఆకులు.. ప్రకృతికి దగ్గరైనట్లుగా అనిపిస్తుంది. పైగా వాటి వల్ల ఇంట్లోకి చల్లని స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది.

సువాసన కోసం..
మనసుని దోచే సువాసనలు ఎక్కడున్నా అక్కడ ప్రశాంతం ఇట్టే పలకరిస్తుంది. రూమ్ ప్రెషనర్స్(Room spray), మంచి వాసన వచ్చే క్యాండిల్స్ వాడటం మంచిది. ఇక సువాసన వచ్చే పూల మొక్కలు పెంచడం, అలాగే సువాసన కోసం అగర్బత్తిలు వెలిగించడం.. వంటివి మంచి అలవాట్లు. దాంతో మీ మూడ్ ఇట్టే మారుతుంది.

సంగీత(Music) స్వరాలు
మ్యూజిక్ లైఫ్‌కి ఎల్లప్పుడూ తెలియని ఎనర్జీని ఇస్తుంది. మీ మనసు బాలేనప్పుడు ఓ మంచి పాట పెట్టుకుని వినండి. అప్పుడే మీరే అంటారు జీవితంలో సంగీతస్వరాలు ఉండాల్సిందే అని.

తీసి పక్కన పెట్టండి
ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అవసరం లేని.. వాడని వస్తువులు ఉంటూ ఉంటాయి. వాటిని తీసి పక్కన పెడితే.. ఇంట్లోనూ మనసులో చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. పైగా అలాంటి వాటిని తీసి ఏ స్టోర్ రూమ్‌లోనో వేసేస్తే.. చూడగానే నీట్‌గా కూడా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇవన్నీ ప్రయత్నించండి. జీవితాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా గడపండి.

Updated On 16 April 2023 12:17 AM GMT
Ehatv

Ehatv

Next Story