పోషకాలకు నిలయం డ్రై ఫ్రూట్స్ (Dry fruits)మన శరీరానికి కావల్సిన పోషకాలు(Nutrients) డ్రైఫ్రూట్స్ లో(Dry fruits) పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ డ్రైఫ్రూట్స్ ప్రతిరోజు తినమని పోషకాహార(Nutrious food) నిపుణులు పదేపదే చెబుతున్నారు.
పోషకాలకు నిలయం డ్రై ఫ్రూట్స్ (Dry fruits)మన శరీరానికి కావల్సిన పోషకాలు(Nutrients) డ్రైఫ్రూట్స్ లో(Dry fruits) పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ డ్రైఫ్రూట్స్ ప్రతిరోజు తినమని పోషకాహార(Nutritious food) నిపుణులు పదేపదే చెబుతున్నారు. జీడిపప్పు(cashew nut), బాదం(Almond), ఎండు ద్రాక్ష(Raisins), వాల్ నట్స్(Wall nuts), వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి కాదు... గుండెకు(heart) ఎంతో మేలు జరుగుతుంది.
డ్రై ఫ్రూట్స్ లో ఖనిజలవణాలు, విటమిన్లు(Vitamins), ఎంజైములు(Enzymes) స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. కనుక ఇవి మానవ శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక(Immune system) వ్యవస్థ పెంపొందించడానికి ఉపయోగపడతాయి. వాటి ద్వారా రోగాలు దరిచేరకుండా.. ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఈ డ్రైఫ్రూట్స్న ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ఒక మంచి పద్ధతి అంటున్నారు ఆరోగ్య నిపుణులు మరి డ్రైఫ్రూట్స్ లో ఏవి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.
జీడిపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇప్పుడు వంటగదిలో ప్రతీ వంటలో ఇది ఉండాల్సిందే. గుండె ఆరోగ్యానికి మంచిదైన ఒలేయిక్ ఆమ్లం ఆలివ్ జీడిపప్పులో పుష్కలంగా ఉంటుంది. దానితో పాటు ఇంకా మెగ్నీషియం, జింక్, ఇనుము ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు జీడిపప్పులో ఉన్నాయి. అందుకే రోజు జీడిపప్పును సరదాగా అయినా ఓ నాలుగు నోట్లో వేసుకుని నమలండి మరి.
ఇక జీడిపప్పు తరువాత అందరికి గుర్తుకు వచ్చేది బాదంపప్పు. బాదాం లో మెగ్నీషియం, పోటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి ఇలా 4 విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. రోజు బాదం పప్పులు తింటే శరీరంలో హానికర కొవ్వును తొలగించి .ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. గర్భవతులు రోజు ఓ రెండు బాదం పప్పులు తింటే వీటిలోని ఫోలేట్, బి విటమిన్లు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా చేస్తాయి.
ఇక డ్రై ప్రూట్స్ లో మరో ముఖ్యమైనవాటి విషయానికి వస్తే.. వాల్ నట్స్ గురించే చెప్పుకోవాలి. వీటిలోని ఒమెగా-3 ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అధిక రక్తపోటునూ హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిల్ని వాల్ నట్స్ లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ నియంత్రిస్తుంది. వీటికుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఒత్తిడి, ఆందోళన వంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతే కాదు రోగనిరోధక శక్తిని పెంపొందింపచేయడంలో కూడా వాల్ నట్స్ ఉపయోగపడతాయి.
ఇక ఎండుద్రాక్ష విషయానికి వస్తే.. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చేసే మేలు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడేవారు,, మెనోపాజ్ దశలో ఉన్న ఆడవారు ఎండుద్రాక్షని రోజు తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే, ఎముకలఆరోగ్యాన్ని పరిరక్షించే బోరెన్ అనే ఖనిజ లవణం ఎండుద్రాక్షలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే వీటి వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఖర్జూర పండ్ల గురించి చూస్తే.. ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్ ప్రక్టోజ్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల మనిషి చిన్న ప్రేగులో ఉత్పన్నం అయ్యే సమస్యలకు వీటితో చెక్ పెట్టవచ్చు. అంతే కాదు ఖర్జూర పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తిండి లేనివారికి ఖర్జూర తింటే చాలు..ఎక్కువ శక్తి ఉత్పన్నం అవుతుంది.
డ్రై ప్రూట్ లో మరో ఇంపార్టెంట్ ఫ్రూట్ ఎండిన అంజీర. ఈ పండులో పీచు, రాగి, మంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం,
విటమిన్-కె వంటివి పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది ఒక్క అంజీర పండులో మాత్రమే. అందుకే ఈ పండును తీసుకోవడం ఎంతో మంచిది. అయితే అది తగిన మోతాదులోనే తీసుకోవాలి.