Eye parasites : మహిళ కంట్లో 60కి పైగా సజీవ పురుగులు
మొన్న అమెరికాలోని(America) ఓ వ్యక్తి పెద్ద పేగులో ఈగను(Fly) చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మనం కూడా అవాక్కయ్యాం! ఇప్పుడు చైనాలో(Chania) ఇలాంటి వింత సంఘటనే చోటు చేసుకుంది. ఏమిటా ఘటన అంటే.. చైనాకు చెందిన ఓ మహిళకు కళ్లలో(Eye) దురద వచ్చింది. అది భరించలేనంత నొప్పిని(Pain) కలిగించింది. అంత నొప్పిలోనూ అదో సాధారణమైన సమస్యగానే భావించింది తప్ప డాక్టర్(Doctor) దగ్గరకు వెళ్లలేదు. ఓ రోజున ఆ నొప్పిని తట్టుకోలేకపయింది. కళ్లను గట్టిగా నలుపుకుంది. అప్పుడో పురుగు(Live worm) కంటి నుంచి కిందపడటం చూసి భయపడిపోయింది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు(Hospital) పరుగులు పెట్టింది. వాళ్లు కంటిని పరీక్షించారు.
మొన్న అమెరికాలోని(America) ఓ వ్యక్తి పెద్ద పేగులో ఈగను(Fly) చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మనం కూడా అవాక్కయ్యాం! ఇప్పుడు చైనాలో(Chania) ఇలాంటి వింత సంఘటనే చోటు చేసుకుంది. ఏమిటా ఘటన అంటే.. చైనాకు చెందిన ఓ మహిళకు కళ్లలో(Eye) దురద వచ్చింది. అది భరించలేనంత నొప్పిని(Pain) కలిగించింది. అంత నొప్పిలోనూ అదో సాధారణమైన సమస్యగానే భావించింది తప్ప డాక్టర్(Doctor) దగ్గరకు వెళ్లలేదు. ఓ రోజున ఆ నొప్పిని తట్టుకోలేకపయింది. కళ్లను గట్టిగా నలుపుకుంది. అప్పుడో పురుగు(Live worm) కంటి నుంచి కిందపడటం చూసి భయపడిపోయింది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు(Hospital) పరుగులు పెట్టింది. వాళ్లు కంటిని పరీక్షించారు. కనురెప్పలు, కనుబొమ్మల(Eye brows) మధ్య చాలా పురుగులు ఉన్నట్టు గుర్తించారు. ఆశ్చర్యపోయారు. వెంటనే వాటిని తొలగించే పని మొదలు పెట్టారు. ఆమె కుడి కన్ను(Right Eye) నుంచి 40కి పైగా పురుగులు వచ్చాయి. అలాగే ఎడమ కంటి(Left Eye) నుంచి పదికిపై పురుగులను తొలగించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇవన్నీ బతికే ఉండటం. టోటల్‌గా ఆమె కళ్ల నుంచి దాదాపు 60కి పైగా సజీవ పురుగులను తొలగించారు. ఇలా అసాధారణ స్థాయిలో పరాన్నజీవులు(Parasites) ఉండటం అనేది చాలా అరుదని, అసాధారణమని డాక్టర్లు అంటున్నారు. ఆమె కళ్లల్లో ఫిలారియోడియా(Filariodia) రకానికి చెందిన పరాన్నజీవులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు డాక్టర్లు.
ఇవి ఎక్కువగా కుక్కలు(Dogs), పిల్లలు(Cats) శరీరాలపై ఉండే లార్వాలని(Larva), అవే ఆమెకు సంక్రమించి ఉండొచ్చని చెబుతున్నారు. చాలామంది తమ పెంపుడు జంతువులను(Pets) తాకి ముద్దు చేసి మళ్లీ ఆ చేతులనే కళ్లను తాకడం, రుద్దడం వంటివి చేస్తారని, అందువల్ల ఆమెకు ఈ జబ్బు వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కళ్లల్లో అవశేష లార్వాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అనే విషయంపై ఆ మహిల తరచూ పరీక్ష(Check) చేయించుకోవలసి ఉంటుందని చెప్పారు. ఒకవేళ పెంపుడు జంతువులను తాకితే గనుక వెంటనే కడుక్కోవాలని ఆమెకు సూచించారు వైద్యులు.