Corona Danger Bells : మళ్లీ విజృంభిస్తున్న కరోనా, జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్ల సూచన
నిన్నమొన్నటి నిధానమై ఉన్న కరోనా(Corona) భూతం మళ్లీ జడలు విప్పుకుంటూ నిద్రలేచింది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 1,805 కేసులు నమోదయ్యాయంటే ఇది ప్రమాద ఘంటికలేనని చెప్పుకోవచ్చు. అదే సమయంలో యాక్టివ్ కేసులు పదివేలు దాటాయి. 134 రోజుల తర్వాత ఈ సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే మొదలు.
నిన్నమొన్నటి నిధానమై ఉన్న కరోనా(Corona) భూతం మళ్లీ జడలు విప్పుకుంటూ నిద్రలేచింది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 1,805 కేసులు నమోదయ్యాయంటే ఇది ప్రమాద ఘంటికలేనని చెప్పుకోవచ్చు. అదే సమయంలో యాక్టివ్ కేసులు పదివేలు దాటాయి. 134 రోజుల తర్వాత ఈ సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే మొదలు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతం ఉంటే వారంరోజుల పాజిటివిటీ రేటు 1.39 శాతంగా ఉంది. చండీగఢ్(Chandigarh), గుజరాత్(Gujarat), హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh), ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), కేరళ(Kerala)లలో ఆరుగురు చనిపోయారు. ఎప్పటిలాగే కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
మరోవైపు తెలంగాణ(Telangana)లో కూడా క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ 12వస్థానంలో ఉంది. ప్రజలను అయితే కరోనా మళ్లీ భయపెడుతున్నది కానీ, ఆందోళన అవసరం లేదంటోంది ఆరోగ్యశాక. గతంలో పోలిస్తే తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా కొన్ని జిల్లాలలో మాత్రం కరోనా వ్యాప్తి పెరిగిందని డాక్టర్లే అంటున్నారు. ఇంతకుముందు 0.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు రెండు శాతం వరకు నమోదవుతుండటమే ఇందుకు సంకేతం. అయితే తెలంగాణలో ఇన్‌ఫ్లూయెంజ కేసులు కూడా ఉన్నాయి. కరోనా, ఇన్‌ఫ్లూయెంజ వైరస్‌ల లక్షణాలు ఒకే తీరుగా ఉండటంతో ఏది కరోనానో, ఏది ఇన్‌ఫ్లూయెంజనో తెలియక ప్రజలు కంగారు పడుతున్నారు. మరోవైపు డాక్టర్లు కూడా కరోనా టెస్ట్‌లు నిర్వహించకుండానే రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజ కేసులకు అధిక మోతాదులో యాంటీ బయాటిక్స్ వాడకూడదని ఎయిమ్స్ చెబుతోంది. అధిక మోతాదులో యాంటీ బయాటిక్స్ వాడితే శరీరంలో సహజసిద్ధంగా ఉన్న రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని, ఫలితంగా కరోనా సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు.