ప్రెగ్నెన్సీ(pregnancy) సమయంలో ఐరన్‌ రిచ్‌ ఫుడ్స్‌, ఐరన్‌ సప్లిమెంట్స్‌ తీసుకుంటే.. రక్తంలో తగినంత ఐరన్‌ నిల్వలు ఉంటాయి. విటమిన్‌ సీ మీ శరీరం ఐరన్‌ను గ్రహించడానికి తోడ్పడుతుంది. ప్రెగ్నెంట్ సమయంలో విటమిన్‌ సి, ఐరన్‌ లోపం ఉంటే.. రక్తహీనతకు దారితీస్తుంది, దీని కారణంగా నెలలు నిండకుండా ప్రసవం అయ్యే అవకాశం ఉంది. దానిమ్మ తీసుకుంటే.. రక్తలేమి దూరం అవుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు పోషకాలు అధికంగా ఉన్న, వారికి నచ్చిన ఫుడ్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లి కాబోతున్న మహిళలు.. ఆరోగ్యకరమైన పండ్లు,(fruits) కూరగాయలను(vegetables) తినడం చాలా ముఖ్యం. ప్రెగ్నెంట్ మహిళలు పోషకాలు ఎక్కువగా ఉండే.. దానిమ్మ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. దానిమ్మలో పొటాషియం, క్యాల్షియం లాంటి మినరల్స్‌తో పాటు ఫైబర్‌ తగినంత మొత్తంలో ఉంటుంది. అలాగే విటమిన్‌-సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి. గర్భం దాల్చిన స్టారింగ్ నుంచే.. దానిమ్మను డైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చుకుంటే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ(Pomegranate)లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ సి మనం తీసుకునే ఆహారం నుంచి ఐరన్‌ను గ్రహిస్తుంది. ప్రెగ్నెన్సీ(pregnancy) సమయంలో ఐరన్‌ రిచ్‌ ఫుడ్స్‌, ఐరన్‌ సప్లిమెంట్స్‌ తీసుకుంటే.. రక్తంలో తగినంత ఐరన్‌ నిల్వలు ఉంటాయి. విటమిన్‌ సీ మీ శరీరం ఐరన్‌ను గ్రహించడానికి తోడ్పడుతుంది. ప్రెగ్నెంట్ సమయంలో విటమిన్‌ సి, ఐరన్‌ లోపం ఉంటే.. రక్తహీనతకు దారితీస్తుంది, దీని కారణంగా నెలలు నిండకుండా ప్రసవం అయ్యే అవకాశం ఉంది. దానిమ్మ తీసుకుంటే.. రక్తలేమి దూరం అవుతుంది.

ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో మహిళలు సాధారణంగా హైపర్‌టెన్షన్‌తో బాధపడుతూ ఉంటారు. బీపీ కంట్రోల్‌లో లేకపోతే.. కడుపులో బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మ నీరు బాగా తగ్గిపోవడం, బిడ్డ కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గర్భిణులు దానిమ్మ రసం తాగడం వల్ల హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. దానిమ్మలో పునికాలాగిన్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది కండరాలను సడలిస్తుంది, బ్లడ్‌ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.

దానిమ్మలో కాల్షియం మెండుగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీల ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ దానిమ్మ పండును తినడం వల్ల ఎముకల క్షీణత తగ్గుతుంది. తల్లి, బిడ్డ ఎముకలు దృఢంగా ఉంటాయి. అంతేకాదు దానిమ్మ రసంలో పాలీఫెనోలిక్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, దీనిలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది పిల్లల బ్రెయిన్‌ అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు గాయాలు, ఒత్తిడి నుంచి పిల్లలను రక్షిస్తుంది.

పోషకాహార లోపం కారణంగా.. ప్రీమెచ్యూర్‌ డెలివరీ అయ్యే ప్రమాదం ఉంది. కొంతమంది మహిళలకు మాయలోనూ సమస్యలు కలగవచ్చు. దీని వల్ల బిడ్డ నెలలు నిండకుండానే పుట్టడం, బరువు తక్కువగా పుట్టే అవకాశం ఉంది. దానిమ్మ యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌. ఈ సమస్యలను పరిష్కరించడానికి దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్‌ సహాయపడతాయి.

Updated On 19 April 2023 2:12 AM GMT
madhuri p

madhuri p

Next Story