ఒక్క స్పూన్ తేనె తయారీ కోసం తేనెటీగలు ఎంత కష్టపడుతాయో తెలుసా..!

రాణి ఈగ మొత్తం తేనె పట్టుకు గుండె కాయ లాంటిది.రోజుకు రెండువేల గుడ్లు పెట్టగలుగుతుంది.నాలుగైదు ఏళ్ళు జీవిస్తుంది.మగ ఈగ ఫలదీకరణం చెందని గుడ్డు నుంచి వస్తుంది.ఇది రాణి తో సంగమించే వరకే జీవనం.అలా జరిగిన మరుక్షణం దాని మరణం. ఏదైనా రెండుమూడు నెలలే. ఓ టీస్పూన్ తేనె అందించేందుకు 12 తేనెటీగలు వాటి జీవితం మొత్తం కష్టపడతాయి. ఒక్క తేనెటీగ సగటున 30-60 రోజులు మాత్రమే జీవిస్తుంది. అది రోజుకు సుమారు 5వేల పుష్పాలను పరాగసంపర్కం చేస్తుంది. ఇలా తన జీవితంలో ఒక్క తేనెటీగ 1.5లక్షల పుష్పాలపై వాలుతుంది. వాటి నుంచి సేకరించిన తేనె టీస్పూన్‌లో పావు వంతు కూడా ఉండదు. కానీ దీనికోసమే ఇవి వాటి జీవితాంతం కష్టపడతాయి. తేనెటీగల పెంపకాన్ని” ఎపి కల్చర్ ‘ అంటారు.తేనె మంచి పోషక విలువలను గుర్తించి వాటిని ఆహార పదార్ధాలలో వాడటం ఎన్నో ఏళ్ల నుంచి ప్రాచుర్యంలో ఉంది. మన ఆయుర్వేదంలో కుడా ఎన్నో మందులను తేనెతో కలిపి ఇవ్వటం వల్ల ఆ మందు త్వరగా జీర్ణం అయి త్వరగా పని చేస్తుందని భావిస్తారు. భస్మాలను అంటే పొడులను తేనెలో రంగరించి తింటారు.విటమిన్ B,C, ఇంకా పొటాషియం వంటివి ఇందులో ఉంటాయి.ఒక తేనెటీగ తన జీవిత కాలం లో స్పూన్ లో పన్నెండో వంతు(1/12) తేనే సేకరిస్తుంది.తేనెటీగల పైన 130 జాతుల మొక్కలు ఫలదీకరణం కోసం ఆధార పడతాయి.మనుషుల కు ఉపయోగపడే ఆహారం తయారు చేసే కీటకాలు ఇవే.
