తేనె(Honey) ప్రకృతి మనకు ప్రసాధించిన అత్యంత అపురూపమైన ఔషధం. తేనెటీగలు పూల మకరందాలను పోగుచేసి తేనె రూపములో మనకి అందిస్తున్నాయి. స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని, అంతే కాదు ఇది బలవర్ధక ఆహారం

తేనె(Honey) ప్రకృతి మనకు ప్రసాధించిన అత్యంత అపురూపమైన ఔషధం. తేనెటీగలు పూల మకరందాలను పోగుచేసి తేనె రూపములో మనకి అందిస్తున్నాయి. స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని, అంతే కాదు ఇది బలవర్ధక ఆహారం కూడా. మితంగా తీసుకుంటే తేనె ఆరోగ్యదేవతలా రక్షిస్తుంది.

ఆయుర్వేద(Ayurvedam) వైద్యంలో తేనెను(Honey) చాలా ఎక్కువగా వాడుతుంటారు. దానిలో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టే.. తేనెను విరివిగా వాడేస్తుంటారు. తేనెకు కొన్ని పదార్థాలను జోడించి తరుచూతాగడం అలవాటు చేసుకుంటే అనేక సమస్యలు దూరమవుతాయి.

తేనెలో ఉన్న విటమిన్స్(Vitamins).. శరీర వ్యాధి నిరోధక(immune system) శక్తిని పెంపొందించును. నిమ్మరసంతో(Lemon water) కలిపి త్రాగితే దగ్గు(cough), గొంతు నొప్పులకు(Throat pains), అధిక బరువు తగ్గడానికి(Excessive weight loss) బాగా పనిచేయును.

తేనె యాంటీ బాక్టీరియల్(Anti bacterial) గా పనిచేస్తుంది... అంతే కాదు యాంటీ సెప్టిక్(Anti septic) గా కూడా ఉపయోగపడుతుంది. చర్మముపై గాయలు, దెబ్బలు మచ్చలపై(Scars) తేన పూస్తే.. అవి కనిపించకుండా పోతాయి.

తేనె చాలా సులభంగా జీర్ణమవుతుంది. మనం రోజు తినే ఇతర ఆహార పదార్థాలకంటే కూడా తేన త్వరగా రక్తంలో(Blood) కలిసి ఎక్కువ శక్తి ఇస్తుంది. అందుకే తేనె తాగితే.. రోజంతా ఉత్సాహంగా పనిచేయవచ్చు.

తేనె టీ, కాఫీల్లో తీసుకుంటే అలసట తొలగిపోతుంది. తేనెలోని గ్లూకోజ్ రక్తప్రసరణను నియంత్రిస్తుంది. కంటి జబ్బులు, చర్మ సంబంధిత వ్యాధులు కూడా తేనె వాడకంతో నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తేనెలో ఖనిజలవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైములు ఉంటాయి. ఇన్ని రకాలు పోషకాలున్నాయి కాబట్టి తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. తేనెలో రంగులూ రకాలూ ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు... ఇలా భిన్నవర్ణాలతో పాటు కొన్ని తేనెలు వర్ణవిహీనంగానూ ఉంటాయి. అవి సేకరించే పూలజాతుల మీద ఆధారపడి ఉంటాయి.

Updated On 10 April 2023 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story