కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (health ministry)శుక్రవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం భారతదేశంలో గత 24 గంటల్లో 11,692 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళ ఇప్పటి వరకు సంభవించిన తొమ్మిది మరణాలతో సహా ఒకే రోజులో 19 మంది వైరస్ కారణంగా మరణించారు.

మొత్తం యాక్టివ్ కేసులు సంఖ్య ఇప్పుడు 66,170కి చేరుకుంది. నిన్నటి 12,591 కేసులతో పోలిస్తే కొత్త కోవిడ్ కేసుల సంఖ్యలో తాజాగా తగ్గుదల కనపడుతుంది .

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరణ ప్రకారం, జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 98.67 శాతంగా ఉంది, మొత్తం ఇన్‌ఫెక్షన్లలో 0.15 శాతం క్రియాశీల కేసులు ఉన్నాయి. 10,780 మంది రికవరీలు నమోదయ్యాయి, దేశవ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 4,42,72,256కి చేరుకుంది.

ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 18 వరకు దేశంలో వరుసగా 7,633నుండి 11,109 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఏప్రిల్ 17న 9,111, ఏప్రిల్ 16న 10,093, ఏప్రిల్ 15న 10,753 నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి. గత 24 గంటల్లో మొత్తం 3,647 డోసులు ఇవ్వబడ్డాయి.

Updated On 21 April 2023 2:52 AM GMT
rj sanju

rj sanju

Next Story