గత కొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు వేగంగా పెరిగాయి . దేశంలో రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు (covid Cases)నమోదుయ్యేవి . తాజాగా రెండు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సోమవారం 9,111 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, మంగళవారం 7 ,633 కొత్త కేసులు నమోదయ్యాయి.

గత కొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు వేగంగా పెరిగాయి . దేశంలో రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు (covid Cases)నమోదుయ్యేవి . తాజాగా రెండు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సోమవారం 9,111 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, మంగళవారం 7 ,633 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Health Ministry) విడుదల చేసిన లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో 11 మంది కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది. ఈ రోజు 7 ,633 కొత్త కేసులతో, మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 61,233 కి చేరుకుంది. 24 గంటల్లో 6 ,702 మంది కరోనా నుండి కోలుకొని బయటకు వచ్చారు .

పలు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఇప్పటికి విషమంగా ఉంది. కొత్త ఇన్ఫెక్షన్ కేసులు తగ్గిన చోట, మరణాల కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా 11 మరణాలలో, 4 మరణాలు ఒక్క ఢిల్లీ(Delhi)లోనే సంభవించాయి . 4 మంది కేరళ(Kerala)లో కూడా ప్రాణాలు కోల్పోయారు. హర్యానా(Haryana), కర్ణాటక(Karnataka), పంజాబ్‌లలో(Punjab) ఒక్కొక్కరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 48 లక్షల 34 వేల 859 మంది కరోనా ఇన్ఫెక్షన్ భారిన పడ్డారు . 4 కోట్ల 42 లక్షల 42 వేల 474 మంది కరోనాను జయించారు . దేశంలో రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా నమోదయ్యాయి.

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రభుత్వం ప్రజలకు కరోనా (Corona)మార్గదర్శకాలను జారీ చేసింది . కొన్ని రాష్ట్రాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. కొన్ని రాష్ట్రాల్లో, మాస్క్‌లు ధరించడంతో పాటు, శానిటైజర్‌ను ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని సూచనలు ఇవ్వబడ్డాయి. గత కొద్దిరోజులతో పోలిస్తే కరోనా కేసులు తక్కువగానే ఉన్నా, పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు .

Updated On 20 April 2023 12:23 AM GMT
rj sanju

rj sanju

Next Story