Covid New Varient : భయభ్రాంతులకు గురి చేస్తున్న కొత్త వేరియంట్.. వేగంగా పెరుగుతున్న కేసులు
కరోనా(Corona) కనుమరుగయ్యిందని, ఆ వైరస్ సృష్టించిన భయానక పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడ్డాం అని అనుకుంటున్న తరుణంలో మరో వేరియంట్ చాప కింద నీరులా తరుముకొస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్నప్పుడు మనం ఎదుర్కొన్నకష్టాలను ఎలా మర్చిపోగలం? వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి గత్యంతరం లేని పరిస్థితులలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించాల్సి వచ్చింది. అప్పుడు ఇంట్లో అందరూ బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.
కరోనా(Corona) కనుమరుగయ్యిందని, ఆ వైరస్ సృష్టించిన భయానక పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడ్డాం అని అనుకుంటున్న తరుణంలో మరో వేరియంట్ చాప కింద నీరులా తరుముకొస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్నప్పుడు మనం ఎదుర్కొన్నకష్టాలను ఎలా మర్చిపోగలం? వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి గత్యంతరం లేని పరిస్థితులలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించాల్సి వచ్చింది. అప్పుడు ఇంట్లో అందరూ బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.
కరోనా సోకిన పేషంట్‌కు భయంతో దూరంగా ఉండాల్సి వచ్చింది. మన కళ్ల ముందు ఆత్మీయుల ప్రాణాలు పోతుంటే నిస్సహాయిలుగా నిల్చుండిపోయిన రోజులు ఇంకా స్మృతిపథంలో అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ మరో రూపంలో కేసులు విజృంభిస్తున్నాయన్న వార్త వణుకుపుట్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organisation) కూడా అన్ని దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి అంత భయానకంగా ఉందా? అసలు కొత్త వేరియంట్ ఎక్కడ వ్యాపించింది?
ఇప్పటి వరకు మనం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) గురించి విన్నాం, దాని తాలూకా కేసులను చూశాం. ఇప్పుడు అది ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ ఈజీ.5.1గా రూపాంతరం చెంది గ్రేట్ బ్రిటన్‌లో వేగంగా విజృంభిస్తోంది. యూకేలో(UK) కరోనా కొత్త వేరియంట్ ఎరిస్(Eris) అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్‌లోని(England) హెల్త్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించి బ్రిటన్‌లో దాదాపు 14.6 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు.
ఈ వైరస్‌కు సంబంధించి ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒకటని యూకేకు చెందిన ఆరోగ్య అధికారులు వివరించారు. ఈ వార్తంలో ఆ కొత్త వేరియంట్‌కు సంబంధించి సుమారు నాలుగువేల కేసులు వచ్చాయని తెలిపారు.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్‌కు జులై 31న ఎరిస్ అనే పేరుతో వర్గీకరించారు. తొలిసారిగా 2023, జూలై 3న దీని తాలుకా కేసులను గుర్తించారు. అది కాస్త నెమ్మదిగా పెరగడంతో ఆరోగ్య అధికారులు తీవ్ర భయాందోళన చెందారు.
ముఖ్యంగా వృద్ధులు ఆసుపత్రులలో ఎక్కువగా చేరుతున్నారని చెప్పారు. మొత్తంగా చూస్తే మాత్రం హాస్పిటల్స్‌లో చేరికలు తక్కువగానే ఉన్నాయని, ఐసీయూలో అడ్మిట్ అవుతున్న కేసులు కూడా పెద్దగా పెరగలేదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ఇప్పుడు కేసులు తక్కువగా ఉన్నాయని నిర్లిప్తంగా ఉంటే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. కేసులు పెరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఎప్పటిలాగే ప్రజలు కరోనా నియమాలను పాటించాలని సూచించారు. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, శ్వాసకోస సంబంధ సమస్యలు వున్నవారికి దూరంగా ఉండాలని తెలిపారు. ఇదిలా ఉంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ కొత్త వేరియంట్ కేసులను ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్‌లు, సంరక్షణ పద్దతులను అవలంబించాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. దేశాలన్ని అప్రమత్తంగా ఉండాలని పిలుపిచ్చారు.