మన దేశంలో చాయ్ ప్రియులు(Tea Lovers) చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి టీ లేదా కాఫీతోనేల(Coffee) రోజూ ప్రారంభమవుతుంది. ఉదయాన్నే టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు.. అలసటగా ఉన్నా.. ఒత్తిడిని తగ్గించుకునేందుకు టీ, కాఫీ తాగుతారు. కొందరు బిస్కెట్ పరాటాను టీతో పాటు ఇష్టంగా తింటారు.పెద్దలను చూసి పిల్లలు కూడా టీ, కాఫీలు తాగడం అలవాటు చేసుకుంటారు.
మన దేశంలో చాయ్ ప్రియులు(Tea Lovers) చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి టీ లేదా కాఫీతోనేల(Coffee) రోజూ ప్రారంభమవుతుంది. ఉదయాన్నే టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు.. అలసటగా ఉన్నా.. ఒత్తిడిని తగ్గించుకునేందుకు టీ, కాఫీ తాగుతారు. కొందరు బిస్కెట్ పరాటాను టీతో పాటు ఇష్టంగా తింటారు.పెద్దలను చూసి పిల్లలు కూడా టీ, కాఫీలు తాగడం అలవాటు చేసుకుంటారు. టీ కోసం పిల్లలు మరాం చేస్తుంటారు. ఇక పెద్దలు కూడా పిల్లలు ప్రతిసారి టీ, కాఫీ ఇస్తుంటారు. కానీ మీకు తెలుసా.. పిల్లలు టీ, కాఫీ వారి ఆరోగ్యానికి ప్రమాదం. ఇందులో ఉండే కెఫిన్ వినియోగం పిల్లలకు చాలా హానికరం. మరీ పిల్లలకు టీ, కాఫీ తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకుందామా.
కాఫీ, టీ తాగడం వల్ల కలిగే నష్టాలు..
1. పిల్లలు టీ, కాఫీలు తాగడం వలన వారి రోగనిరోధక శక్తి(Immune System) లోపల నుండి బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీంతో వారు రోజు రోజుకీ బలహీనంగా అవుతుంటారు. అంతేకాకుండా ఇది జీర్ణ శక్తిని(Digestive System) ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
2. టీ, కాఫీలలో టానిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కాల్షియం(Calcium), ఐరన్(Iron) పిల్లల శరీరం గ్రహించకుండా నిరోధిస్తాయి. పిల్లల్లో రక్తహీనత రావడానికి ఇదే కారణం. ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. కీళ్ల నొప్పులు ముందుగానే మొదలవుతాయి.
3. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడుపై చాలా ప్రభావం చూపుతుంది. టీ, కాఫీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది చాలా కాలం పాటు చురుకుగా ఉంచుతుంది. ప్రజలు నిద్రపోవాలనుకున్నప్పుడు దాన్ని తీసుకుంటారు. పిల్లలు తీసుకుంటే వారికి నిద్ర లేకపోవడం, ప్రవర్తనలో మార్పు, చిరాకు, ఒత్తిడి, నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్ర లేకపోవడం వల్ల శారీరకంగానూ, మానసికంగానూ ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది.
4. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల క్యావిటీతోపాటు పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. నెలలు నిండకుండానే శిశువులకు ఎసిడిటీ సమస్య రావచ్చు. ఇది పిల్లలలో ఆకలిని కూడా తగ్గిస్తుంది. అయితే పిల్లల పెరుగుదలకు సరైన పోషకాలు అవసరం.
5. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలకు వారానికి 2 కప్పుల కంటే ఎక్కువ టీ లేదా కాఫీ ఇవ్వకూడదు. అలాగే, టీ లేదా కాఫీని చాలా స్ట్రాంగ్ చేయకూడదని గుర్తుంచుకోండి.