తెలంగాణలో ఉష్ణోగ్రతలు (Temperatures) ఒక్కసారిగా పడిపోవడంతో ప్రతీ ఇంట్లో ఎవరికో ఒకరికి జలుబు (Cold) పట్టుకుంది. ముఖ్యంగా చిన్నారులకు దగ్గు (Cough), జలుబు పట్టి పీడిస్తోంది. పల్లె నుంచి పట్నం దాకా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా (Covid) కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. వచ్చింది సాధారణ జబ్బా లేదా కరోనానా అన్న ఆందోళన తల్లిదండ్రులను కలవరపెడుతోంది.

Human Gets Cold, Cough
తెలంగాణలో ఉష్ణోగ్రతలు (Temperatures) ఒక్కసారిగా పడిపోవడంతో ప్రతీ ఇంట్లో ఎవరికో ఒకరికి జలుబు (Cold) పట్టుకుంది. ముఖ్యంగా చిన్నారులకు దగ్గు (Caugh), జలుబు పట్టి పీడిస్తోంది. పల్లె నుంచి పట్నం దాకా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా (Covid) కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. వచ్చింది సాధారణ జబ్బా లేదా కరోనానా అన్న ఆందోళన తల్లిదండ్రులను కలవరపెడుతోంది. జలుబు, దబ్బు సాధారణమేనని.. సీజనల్ వ్యాధుల సమయంలో కంటే ఇప్పుడు ఓపీ పేషెంట్లు (OP Patients) తగ్గిపోయారని నిలోఫర్ (Nilofer) వైద్యులు తెలిపారు. నిలోఫర్‌లో సీజనల్ వ్యాధుల సమయంలో 400 వరకు చిన్నారు జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చేవారని.. ఈ సంఖ్య ఇప్పుడు 100లోపే ఉంటుందన్నారు. జలుబు, దగ్గు తగ్గేందుకు వారం పడుతుందని దీంతో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అయితే జలుబు, దగ్గుతో పాటు జ్వరం కూడా మూడు రోజులపాటు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. చిన్నారులకు వైద్యులు (Doctors) సూచించిన మేరకే యాంటీ బయాటిక్స్ వాడాలని చెప్తున్నారు. జలుబు, దగ్గు లక్షణాలకు మంచినీరుకు (Drinking Water) మించిన ఔషధం లేదంటున్నారు. నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలని సూచిస్తున్నారు.
